Movie News

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న టైంలో పెద్దితో మొదలైన విజయాల ప్రవాహం చెన్నై లవ్ స్టోరీ దాకా కొనసాగింది. ఊరట ఏంటంటే డబ్బింగ్ సినిమాలు వీరభద్రుడు, ది ఒడిస్సి, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లాంటివి వసూళ్ల పరంగా దోహదం చేసి ఎగ్జిబిటర్లకు పెద్ద రిలీఫ్ అందించాయి. ముఖ్యంగా థియేటర్ వ్యవస్థ మీదే బ్రతుకుతున్న లక్షలాది మందికి ఈ పరిణామాలు ఎంతో మేలు చేశాయి. ఇక ఆగస్ట్ మొదలయ్యింది.

ప్రభుత్వ సెలవులు ఎక్కువగా ఉండే నెల కావడంతో ఆక్యుపెన్సీలు బాగుంటాయి. కాకపోతే ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ పడాలి. వరుణ్ తేజ్ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ‘కొరియన్ కనకరాజు’ మీద క్రమంగా బజ్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పబ్లిక్ అటెన్షన్ వస్తోంది. కాకపోతే టాక్ చాలా కీలకం కానుంది. లోకేష్ కనగరాజు తమిళ అనువాదం ‘డిసి’ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందనే అనుమానాలు జనాల్లో లేకపోలేదు. దీక్షిత్ శెట్టి ‘కెజెక్యూ’ పబ్లిసిటీ పెంచే పనిలో ఉంది.

రెండో వారంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ముఖ్యంగా యూత్ అండ్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. లక్కీ భాస్కర్ తీసిన వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో ఆ సాఫ్ట్ కార్నర్, సూర్య ఇమేజ్ రెండూ దీనికి ప్లస్ కానున్నాయి. ఎంఎస్ రాజు తీసిన హారర్ మూవీ ‘అగథ’తో పాటు అన్నపూర్ణ సంస్థ సమ్పరించిన ‘పళ్ళబురుసు’కి వెరైటీ ప్రచారం చేస్తున్నారు. ఆగస్ట్ 21 రవితేజ ‘ఇరుముడి’ మీద అంచనాల గురించి తెలిసిందే. అయ్యప్ప ఎలిమెంట్ జనాల్లోకి బాగా దూసుకెళ్లింది.

దానికి ఒక రోజు ముందు దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్, పృథ్విరాజ్ సుకుమారన్ ఖలీఫా వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆగస్ట్ 26 రానున్న ‘టాక్సిక్’ మరో ఎత్తు. కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న యష్ మూవీ కావడంతో దర్శకురాలు ఎవరనే దానితో సంబంధం లేకుండా బజ్ భారీగానే ఉంది. ఏపీ తెలంగాణలో దిల్ రాజు భారీ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. శర్వానంద్ ‘భోగి’ ఆగస్టు 28న షెడ్యూల్ చేశారు. ఇప్పటికైతే వాయిదా ప్రకటన ఇవ్వలేదు. తప్పుకునే సూచనలున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా మరికొన్ని బాలీవుడ్ హాలీవుడ్ అనువాదాలు ఆగస్ట్ లో రాబోతున్నాయి. టాప్ కిరీటం ఎవరికి దక్కుతుందో చూడాలి.

This post was last modified on August 1, 2026 10:23 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago