Movie News

సర్దార్ 2 ఈసారి మరింత సీరియస్

కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ మంచి హిట్ సాధించిన ఈ స్పై డ్రామా కొనసాగింపు కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మధ్యలో దర్శకుడు మిత్రన్ టాలీవుడ్ స్టార్లతో ప్యాన్ ఇండియా మూవీ తీయాలని ట్రై చేసి తిరిగి సర్దార్ కొనసాగింపుకే వెళ్లిపోయారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మొదటి భాగంలో నటించిన వాళ్ళతో పాటు కొత్త క్యాస్టింగ్ తోడయ్యారు.

తాజాగా విడుదల చేసిన టీజర్ లో క్లుప్తంగా కథేంటో చెప్పారు. రహస్య జీవితాన్ని పూర్తి చేసుకుని బయటికి వచ్చిన సర్దార్ (కార్తీ) వయసైపోయినా కూడా శత్రువుల భరతం పట్టేందుకు ఏమాత్రం వెనుకాడడు. కొడుకు (కార్తీ) పైకి జులాయిగా సరదాగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు తుక్కు రేపే టైపు. వీళ్లిద్దరి కామన్ ఎనిమి (ఎస్జె సూర్య) దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుంటాడు. మరి తండ్రి కొడుకులు కలిసి ఎలా వాడి మిషన్ ని భగ్నం చేశారనేది స్టోరీ పాయింట్ గా కనిపిస్తోంది.

స్కేల్ పరంగా చూసుకుంటే సర్దార్ 2కి ఈసారి భారీగా ఖర్చు పెట్టారు. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ చూస్తేనే అర్థమైపోతుంది. కార్తీ డ్యూయల్ రోల్ లో మరోసారి అదరగొట్టేలా ఉన్నాడు. రాజా సాబ్ లో మిస్ ఫైర్ అయిన మాళవిక మోహనన్  కు ఎక్కువ స్కోప్ దొరికింది. అయితే ఎస్జె సూర్య ఎప్పటిలాగే తన డామినేషన్ చూపించే ప్రయత్నం చేశారు. ఒక డైలాగ్ లో ఆ మాట చెప్పించారు కూడా. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్.

సెప్టెంబర్ 10 రెండో సర్దార్ విడుదల కాబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ టై అప్ కాబట్టి రిలీజ్ చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. పోటీలో ఉంటాయనుకున్న ధనుష్ ఓం, విజయ్ దేవరకొండ రణబాలి వాయిదా పడటంతో ఆ అవకాశం సర్దార్ 2కి కలిసి రానుంది. సక్సెస్ కోసం కార్తీ మొహం వాచిపోయి ఉన్నాడు. జపాన్, అన్నగారు వచ్చారు చాలా దారుణంగా పోయాయి. అన్నయ్య సూర్యకు వీరభద్రుడు బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టు తమ్ముడికి సర్దార్ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.

This post was last modified on July 31, 2026 10:32 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago