Movie News

పవన్ కోసం రేణు… షారుఖ్ కోసం కరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బద్రి, ఖుషి, బాలు లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్‌గా, సూపర్ స్మార్ట్‌గా కనిపించాడు అంటే.. అప్పటి యూత్‌కు స్టైల్ ఐకాన్‌గా మారాడు అంటే.. అందులో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పాత్ర కీలకం. ఆ సినిమాలన్నింటికీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది రేణునే. ‘బద్రి’ చేస్తున్నపుడే పవన్‌తో ప్రేమలో పడిపోయిన ఆమె.. ఆయన సినిమాల మేకింగ్‌లో కీలకంగా ఉండేది. ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా తనే చూసుకునేది.

తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో అప్పటి అనుభవాల గురించి రేణు మాట్లాడింది. పవన్ సినిమాల్లో వాడే కాస్ట్యూమ్స్ కోసం విదేశాలకు కూడా వెళ్లి షాపింగ్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.

20 ఏళ్ల ముందు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ సినిమా కాస్ట్యూమ్స్ కోసం తాను లండన్‌కు వెళ్లేదాన్నని.. అక్కడికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా వచ్చేవాడని రేణు దేశాయ్ తెలిపింది. అక్కడి భారీ షాపింగ్ మాల్‌లో తాము ఇద్దరమే ఉండేవాళ్లమని.. తాను పవన్ బట్టల కోసం అక్కడికి కోసం వస్తే, షారుఖ్ కాన్ కాస్ట్యూమ్స్ కోసం కరణ్ వచ్చేవాడని రేణు వెల్లడించింది. కరణ్ జోహార్ పెద్ద దర్శకుడు అయినా, షారుఖ్ ఖాన్ కోసం ఆయన బట్టలు కొనాల్సిన అవసరం లేకపోయినా.. ప్రేమతో, సినిమా కోసం అలా చేసేవాడని రేణు చెప్పింది.

మరోవైపు అప్పట్లో సంచలనం రేపిన ‘బాలు’ సినిమా ప్యాంట్స్ గురించి కూడా రేణు మాట్లాడింది. ఆ ప్యాంటును కూడా ఇటలీలోని మిలాన్ నుంచి తెప్పించినట్లు రేణు వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి క్లాత్‌తో కేవలం ఐదు ప్యాంట్లు మాత్రమే తయారు చేస్తే.. అందులో ఒకటి పవన్ కోసం తీసుకున్నట్లు రేణు తెలిపింది.

ఆ ప్యాంట్ కోసం అప్పట్లోనే రూ.75 వేలు ఖర్చు పెట్టామని, అంత బడ్జెట్ ఎందుకనే చర్చ వస్తే.. పవన్ ఐదు వేల రూపాయల ప్యాంట్లు పది వేసుకోవడం కంటే, ఈ ఒక్క స్పెషల్ ప్యాంటు మీద ఆ రేటు పెట్టడం కరెక్టే అని నిర్మాతను ఒప్పించినట్లు రేణు తెలిపింది. అప్పట్లో ఆ ప్యాంట్స్ చర్చనీయాంశం అయ్యాయని.. ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అప్పుడు అంత బడ్జెట్ పెట్టడంలో తప్పు లేదని ఆమె అభిప్రాయపడింది.

This post was last modified on November 4, 2026 11:00 am

Share

Recent Posts

అల్లు అరవింద్ హీరో… జయసుధ హీరోయిన్

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది అగ్ర కథానాయకులకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు…

6 minutes ago

జ‌గ‌న్ భ‌యాల‌ను పోగొట్టిన బ్యాలెట్లు!

ఎన్నిక‌లు ఏవైనా ఎన్నిక‌లే.. ఈ మాటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గిట్ట‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు ఈవీఎంల‌పై న‌మ్మ‌కం పోయింది. 2024…

2 hours ago

చిన్న సినిమాలు.. పెద్ద పేర్లతో ఆశలు

చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొత్త హీరోలు, దర్శకులతో తీసిన సినిమాలకు మొదటి…

2 hours ago

హీరోయిన్లకు నవంబర్ పరీక్ష.. సోలోగా నిలబడతారా?

స్టార్ హీరోలతో కలిసి నటించినప్పుడు హీరోయిన్లకు వచ్చే క్రేజ్ వేరు. అదే సొంతంగా సినిమాను నడిపించాల్సి వస్తే పరిస్థితి మరోలా…

4 hours ago

ఆరు షోలు సరే.. లాంగ్ రన్ సంగతేంటి?

స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఎక్కువ షోలు వేసుకునేందుకు…

6 hours ago

రూ.20 వేల కోట్ల ఆస్తి.. అమెరికాలో గవర్నర్ రేసులో మనోడు!

అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ…

8 hours ago