Movie News

అల్లు అరవింద్ హీరో… జయసుధ హీరోయిన్

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది అగ్ర కథానాయకులకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు లెజెండరీ నటి జయసుధ. అలాంటి నటి ఇప్పుడు సీనియర్ నిర్మాత అల్లు అరవింద్‌కు జోడీగా నటించాలని ఆశపడుతుండడం విశేషం. ఈ విషయాన్ని ఒక స్టేజ్ మీద చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సహజ నటి.

జయసుధ తాజాగా ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జయసుధ హాజరు కాగా.. అల్లు అరవింద్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అరవింద్‌ను ఉద్దేశించి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అరవింద్ నిర్మాతగా ఫేమస్ అయ్యారు కానీ.. ఆయన సూపర్ యాక్టర్ అనే సంగతి ఈ తరానికి తెలియదని, ఆయన చాలా బాగా నటిస్తారని జయసుధ అన్నారు. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఎప్పుడో చెప్పానని, కుదరలేదని.. కానీ ఇప్పుడు చేద్దామని అరవింద్‌ను ఉద్దేశించి చెప్పారు. ఈ సినిమాకు ‘రోమన్ హాలిడే’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని కూడా జయసుధ అన్నారు. ఈ మాటకు అరవింద్ నవ్వుతూ, సరే అన్నట్లు తల ఊపారు.

అరవింద్‌కు సన్నిహితుడైన యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాను నిర్మించాడు. శ్రీకర్ నయన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో ఫేమస్ అయిన కుర్రాడు రోహన్.. ‘35: చిన్న కథ కాదు’ చిత్రంతో మంచి పేరు సంపాదించిన అరుణ్ దేవ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జయసుధ.. అరుణ్ దేవ్ అమ్మమ్మ పాత్ర చేసింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on November 4, 2026 11:05 am

Share

Recent Posts

పవన్ కోసం రేణు… షారుఖ్ కోసం కరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బద్రి, ఖుషి, బాలు లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్‌గా, సూపర్ స్మార్ట్‌గా కనిపించాడు అంటే..…

13 minutes ago

జ‌గ‌న్ భ‌యాల‌ను పోగొట్టిన బ్యాలెట్లు!

ఎన్నిక‌లు ఏవైనా ఎన్నిక‌లే.. ఈ మాటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గిట్ట‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు ఈవీఎంల‌పై న‌మ్మ‌కం పోయింది. 2024…

2 hours ago

చిన్న సినిమాలు.. పెద్ద పేర్లతో ఆశలు

చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొత్త హీరోలు, దర్శకులతో తీసిన సినిమాలకు మొదటి…

2 hours ago

హీరోయిన్లకు నవంబర్ పరీక్ష.. సోలోగా నిలబడతారా?

స్టార్ హీరోలతో కలిసి నటించినప్పుడు హీరోయిన్లకు వచ్చే క్రేజ్ వేరు. అదే సొంతంగా సినిమాను నడిపించాల్సి వస్తే పరిస్థితి మరోలా…

4 hours ago

ఆరు షోలు సరే.. లాంగ్ రన్ సంగతేంటి?

స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఎక్కువ షోలు వేసుకునేందుకు…

6 hours ago

రూ.20 వేల కోట్ల ఆస్తి.. అమెరికాలో గవర్నర్ రేసులో మనోడు!

అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ…

8 hours ago