Political News

జ‌గ‌న్ భ‌యాల‌ను పోగొట్టిన బ్యాలెట్లు!

ఎన్నిక‌లు ఏవైనా ఎన్నిక‌లే.. ఈ మాటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గిట్ట‌దు. ఎందుకంటే ఆయ‌న‌కు ఈవీఎంల‌పై న‌మ్మ‌కం పోయింది. 2024 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 151 స్థానాల నుంచి 11 సీట్ల‌కు ఆయ‌న ప‌డిపోవ‌డ‌మే కార‌ణం. దీంతో ఈవీఎంల‌పై మీట నొక్క‌డం అంటే.. ఎక్క‌డో ఏదో జ‌రిగిపోతుంద‌ని.. మ‌త‌ల‌బు కూడా ఉంటుంద‌న్న‌ది జ‌గ‌న్ వాద‌న‌. 2024లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. కౌంటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ మీడియా ముందుకు వ‌చ్చారు. ఇవే వ్యాఖ్య‌లు చేశారు. ఎక్క‌డో ఏదో జ‌రిగింది. ఈవీఎంల‌లో ఏదో చేశారు. కానీ, నా ద‌గ్గ‌ర ఆధారాలు లేవు అని అన్నారు.

ఆ త‌ర్వాత కూడా ప‌లు సందర్భాల్లో ఈవీఎంల‌పై జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేయ‌డం తెలిసిందే. ఇంత‌కీ దీనికి కార‌ణం.. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేప‌ర్‌పై ఎన్నిక‌లు నిర్వ‌హించి ఉంటే.. ప్ర‌జ‌లు గుండుగుత్త‌గా త‌మ‌నే గెలిపిస్తార‌ని.. ప్ర‌జ‌లు త‌మ వెంటే ఉన్నార‌ని ఆయ‌న అభిప్రా యం. అయితే.. జ‌గ‌న్ ఈవీఎంల‌పై పెట్టుకున్న‌ భ‌యాన్ని.. బ్యాలెట్‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు తీర్చేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌లు పూర్తిగా బ్యాలెట్ పేప‌ర్ల‌పైనే జ‌రిగాయి. అంటే.. ప్ర‌జ‌లు పేప‌ర్ల‌పైనే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఎక్క‌డా ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను వినియోగించ‌లేదు.

అంటే.. ఎక్క‌డా కూడా జ‌గ‌న్ అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్టు.. ట్యాంప‌రింగ్ కూడా చేయ‌లేదు. పూర్తిగాప్ర‌జ‌లు త‌మ దృష్టిలో ఉన్న, పేప‌ర్‌పై నే త‌మ‌కు క‌నిపిస్తున్న గుర్తుపైనే ఓటు వేశారు. మొత్తంగా జ‌గ‌న్ ఈవీఎంల‌పై పెట్టుకున్న భ‌యాన్ని ఈ బ్యాలెట్ ద్వారా ప్ర‌జ‌లు కూడా తీర్చేశారు. క‌ట్ చేస్తే.. బ్యాలెట్ ద్వారా మాత్ర‌మే గెలుస్తామంటూ.. జ‌గ‌న్ పేర్కొన్న విష‌యాలు.. ఆనాటి వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈవీఎంలు కాబ‌ట్టే తాము ఓడిపోయామ‌ని అన్న ఆయ‌న‌.. తాజాగా బ్యాలెట్ తీర్పులోనూ పిల్లిమొగ్గలు వేశార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌ట్టుమ‌ని నాలుగు మునిసిపాలిటీల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది.

ఇక‌, 13 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌ల‌కు జ‌రిగితే.. అది కూడా బ్యాలెట్‌పైనే జ‌రిగిన అక్క‌డ కూడా వైసీపీ త‌న స‌త్తా చాట‌లేక పోయింది. అంటే.. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? ఎవ‌రిని కోరుకుంటున్నారు? ఎవ‌రికి ఓటు వేస్తున్నార‌న్న‌ది సుస్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ భ‌య ప‌డిన‌ట్టు లేదా ఆరోపించిన‌ట్టు ఈవీఎంల‌తో ఆయ‌న‌కు కానీ.. ఆయ‌న పార్టీకి కానీ ఎక్క‌డా అన్యాయం జ‌ర‌గ‌లేదని.. ప్ర‌జ‌లు ఆచితూచే 2024లో తీర్పు ఇచ్చార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగిన బ్యాలెట్ ఎన్నిక‌లే దీనికి ఉదాహ‌ర‌ణ అని పేర్కొంటున్నారు. మొత్తంగా.. ఈవీఎంల‌పై జ‌గ‌న్ పెట్టుకున్న బెంగ‌.. తాజా బ్యాలెట్ పోరు ప‌టాపంచ‌లు చేసింద‌ని అంటున్నారు.

This post was last modified on November 3, 2026 10:12 pm

Share

Recent Posts

చిన్న సినిమాలు.. పెద్ద పేర్లతో ఆశలు

చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కొత్త హీరోలు, దర్శకులతో తీసిన సినిమాలకు మొదటి…

15 minutes ago

హీరోయిన్లకు నవంబర్ పరీక్ష.. సోలోగా నిలబడతారా?

స్టార్ హీరోలతో కలిసి నటించినప్పుడు హీరోయిన్లకు వచ్చే క్రేజ్ వేరు. అదే సొంతంగా సినిమాను నడిపించాల్సి వస్తే పరిస్థితి మరోలా…

2 hours ago

ఆరు షోలు సరే.. లాంగ్ రన్ సంగతేంటి?

స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఎక్కువ షోలు వేసుకునేందుకు…

4 hours ago

రూ.20 వేల కోట్ల ఆస్తి.. అమెరికాలో గవర్నర్ రేసులో మనోడు!

అమెరికాలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరోసారి ఫోకస్ లోకి వచ్చారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ…

6 hours ago

సీఎంను విమర్శిస్తే కేసులా.. పోలీసులకు హైకోర్టు క్లాస్!

అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…

8 hours ago

SRH బౌలింగ్‌లో భారీ మార్పులు.. CSKతో డీల్?

ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…

10 hours ago