రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్, రన్బీర్ కపూర్ లకే. సీతగా ముఖ్య భూమిక పోషించిన సాయిపల్లవికి మిశ్రమ ఫలితం దక్కింది. మాములుగా ఏదైనా మూవీలో తను ఉందంటే సక్సెస్ లో అధిక శాతం క్రెడిట్ తనకే దక్కుతుంది. ఫిదా, లవ్ స్టోరీ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. విరాట పర్వం ఆడకపోయినా ఆ మాత్రం వసూళ్లు వచ్చాయంటే ప్రధాన కారణం సాయిపల్లవినే. అందుకే రామాయణ విషయంలో అసంతృప్తిగా ఉంది.
అయితే ఈ లోటుని ఓంలో నిత్య రెడ్డి క్యారెక్టర్ దాదాపుగా తీర్చేసిందని చెప్పాలి. ఎందుకంటే ధనుష్, మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్లను కాదని ఆమె గురించి విమర్శకులు మాట్లాడుతున్నారంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఓమ్ కథ మొత్తం నిత్యారెడ్డి చుట్టే తిరుగుతుంది. ఎమోషన్ బ్లాక్స్ తో పాటు కష్టమైన ఫైట్లు కూడా పెట్టాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. టాక్ మిశ్రమంగా ఉన్నా కలెక్షన్లైతే వీకెండ్ వరకు బాగానే వస్తున్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే నాలుగు వేల కోట్లతో తీసిన రామాయణ కన్నా వంద కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఓమ్ వల్లే సాయిపల్లవికి ఎక్కువ పేరు వస్తోంది. ఇందులో తనకు డాన్సులు లేవు. పాటలు పెట్టలేదు. పైగా భర్త, తండ్రి చనిపోయిన పోలీస్ ఆఫీసర్ గా కఠినమైన పాత్ర డిజైన్ చేశారు. దానికి తోడు రిస్క్ అనిపించే స్టంట్స్ ఉండనే ఉన్నాయి. ఇంత ఛాలెంజింగ్ ఉంది కాబట్టే కాస్త జుత్తు కత్తిరించుకోవడానికి కూడా వెనుకాడలేదు. దానికి తగ్గ రిజల్ట్ అయితే దక్కింది.
మరి ఓమ్ కమర్షియల్ గా పెద్ద స్థాయికి వెళ్తుందా అంటే అనుమానమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆదివారం వరకు ఇబ్బంది లేదు కానీ సోమవారం నుంచి డ్రాప్స్ ఎంత మోతాదులో ఉంటాయోనని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే టాక్ ప్రభావం మొదటి వారాంతం కనిపించకపోయినా తర్వాతయినా ఉంటుంది. ముందు అనుకున్నట్టు రెండు భాగాలు కాబట్టి ఓం కథ ఇక్కడితో ముగిసిపోయింది. పైగా నిత్య రెడ్డి పాత్రకు ఫినిషింగ్ ఇచ్చేశారు కనక సీక్వెల్ గురించి ఎలాంటి ఆలోచనలు లేనట్టే.
This post was last modified on November 21, 2026 10:10 pm
ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన…
కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…
వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…