ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన సినిమాల్లో ఫాదర్ రెఫరెన్సులు పెట్టడం.. తన సినిమాల ఈవెంట్లకు తండ్రిని పిలవడం లాంటివి అన్ని ఇండస్ట్రీల్లోనూ చూస్తుంటాం. ఇందులో తప్పుబట్టడానికి కూడా ఏమీ లేదు. అభిమానులు ఇలాంటివి ఆశిస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ బాటలో సాగలేదు. మొదట్నుంచి తన రూటే సెపరేటు అన్నట్లు సాగిపోయాడు.
అతను మమ్ముట్టి కొడుకు అనే విషయమే గుర్తు రానట్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ సినిమాలతో సాగిపోతూ.. వివిధ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించాడు దుల్కర్. అతడికి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి కల్ట్ మూవీస్ అందించిన అతను లేటెస్ట్‌గా ఆకాశంలో ఒక తార రూపంలో మరో క్లాసిక్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ.. క్రమంగా బాగానే పుంజుకుంటోంది ఆకాశంలో ఒక తార. ఫుల్ రన్ అయ్యేసరికి ఈ చిత్రం సూపర్ హిట్ రేంజికి వెళ్తుందనే అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం క్లాసిక్ స్టేటస్ అందుకుంటుందని, చాలా అవార్డులు కూడా సాధిస్తుందని భావిస్తున్నారు.
విశేషం ఏంటంటే.. ఈ సినిమా రిలీజైన నవంబరు 20నే దుల్కర్ తండ్రి మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం ఓం కూడా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద రిలీజే దక్కింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కూడా. కానీ ఓంకు అంతటా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ వచ్చి ఉండొచ్చు కానీ.. సినిమా నిలబడే అవకాశాలు కనిపించడం లేదు.
ఇందులో మమ్ముట్టి బాగానే నటించినా.. ఆయన పాత్రను మరీ డంబ్‌గా తీర్చిదిద్దారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మమ్ముట్టి స్థాయి నటుడు చేయాల్సిన పాత్ర కాదని అంటున్నారు. ఓం అంతిమంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ కావడమే కాదు, మమ్ముట్టి మరిచిపోవాల్సిన పాత్రల్లో ఒకటయ్యేలా ఉంది. కొడుక్కి అంత అప్రిషియేన్ వస్తున్న టైంలో అతడితో పోటీపడ్డ మమ్ముట్టికి ఇలాంటి పేలవమైన పాత్ర పడడం విచిత్రం. మొత్తానికి దుల్కర్ ఈ వీకెండ్ వరకు తండ్రిని మించిన కొడుకు అనిపించుకుంటున్నాడన్నమాట.
This post was last modified on November 21, 2026 11:31 pm
కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…
వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…