మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేయడంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడు. ఒకపక్క డైరెక్షన్ కూడా చేస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉండటం ఆయనకే చెల్లింది. వేగం సంగతేమో కానీ వారణాసి విలన్ ఇస్తున్న ఫ్లాపుల ప్రభావం బయ్యర్ వర్గాలను భయపడుతోంది. ఒకదాన్ని మించి మరొకటి సూపర్ ఫ్లాప్ అవుతూ మార్కెట్ లో కనీస సౌండ్ చేయడం లేదు. పరాజయాల పరంపరలో కుంభ తడిసి ముద్దవుతున్నాడు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ ‘దాయ్ రా’ దారుణంగా ఫెయిలయ్యింది. మొదటి వీకెండ్ కాకుండానే చేతులు ఎత్తేసింది. పృథ్విరాజ్, కరీనా కపూర్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా పనవ్వలేదు. దీనికన్నా ముందు గత నెల వచ్చిన ‘ఖలీఫా’ సైతం బోల్తా కొట్టిన బ్యాచులోకే చేరింది. అయినా సరే దానికి రెండో భాగం ప్రకటించడం పెద్ద ట్విస్టు. ‘ఐ నోబడి’ని తెలుగు డబ్బింగ్ తో పాటు విడుదల చేస్తే ఫస్ట్ డేనే హ్యాండ్స్ అప్ అనేసింది. గెస్టు రోల్ చేసిన ‘పల్లిచట్టంబి’ కూడా ఇదే బాపతే.
పుష్ప స్టైల్ లో ట్రై చేసిన ‘విలయత్ బుద్ధా’ని జనం పట్టించుకోలేదు. ఎల్2 ఎంపురన్ ఒరిజినల్ వెర్షన్ లో మాత్రమే వసూళ్లు తెచ్చింది కానీ డబ్బింగులు ఊసులో లేకుండా పోయాయి. గత కొన్నేళ్లలో ‘గురువాయిర్ అంబలనాదయిల్’ ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్లు వసూలు చేసింది. గోట్ లైఫ్ కి ఎంత కష్టపడినా కమర్షియల్ గా రికార్డులు రాలేదు. హిందీలో సర్జమీన్, బడేమియా చోటేమియా వర్కౌట్ కాలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డుతో అవకాశాలకు లోటు లేకుండా చూసుకోవడం పృథ్విరాజ్ కు మాత్రమే చెల్లింది.
ప్రస్తుతం తను రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. వారణాసి షూటింగ్ దాదాపు అయిపోవస్తోంది. విలన్ కుంభగా రాజమౌళి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటారు. నాని బ్లడి రోమియో కూడా లాకైనట్టే. ప్యారడైజ్ రిలీజ్ తర్వాత అధికారిక ప్రకటన ఇస్తారు. ఫలితాలను పట్టించుకోకుండా తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ పోతున్న పృథ్విరాజ్ రాజ్ సుకుమారన్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చేది జక్కన్ననే అనిపిస్తుంది. కాకపోతే హీరో కాదు కాబట్టి ఆ ఆనందం పరిమితమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates