పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి రాముడులో జూనియర్ ఎన్టీఆర్, నాయక్ లో రామ్ చరణ్, పోకిరిలో మహేష్ బాబు, సుప్రీమ్ లో సాయిదుర్గతేజ్ ఇలా లిస్టు పెద్దదే ఉంది. అయితే వీళ్ళందరూ చేసినవి డ్యూయెట్ సాంగ్స్. అంటే మాస్ ఆడియన్స్ వేటి కోసమైతే విజిల్స్ వేస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నవి. నవంబర్ 27 విడుదల కాబోతున్న రష్మిక మందన్న మైసా దర్శకుడు రవీంద్ర పుల్లే తెలివైన ఐడియా వేశారు.
ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేయించి మైసా కోసం వాడుకున్నారు. కాపీ రైట్స్ సమస్య లేకుండా ఒరిజినల్ కంపోజర్ వందేమాతరం శ్రీనివాస్ గారితోనే పాడించి సుద్దాల అశోకతేజ్ సాహిత్యాన్ని తీసుకున్నారు. మ్యూజిక్ కంపెనీతో డీలింగ్ కూడా అయిపోయింది. అప్పట్లో ఈ పాట సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా వినిపించేది. కడవ మీద కడవ పెట్టి నువ్వు నడుస్తూ ఉంటే ఓ రాములమ్మ అంటూ మాస్ జనాలు పదే పదే వినేవాళ్ళు.
కథ దృష్ట్యా అది డిమాండ్ చేసినందుకే రాములమ్మ పాటను తీసుకున్నామని టీమ్ చెబుతోంది. ఒకరకంగా దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది ఓపెనింగ్ రోజు తెలుస్తుంది. ఎందుకంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒసేయ్ రాములమ్మ మీద జనంలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆల్బమ్ కున్న ఆదరణ మాటల్లో కొలిచేది కాదు. దాన్ని సరిగ్గా వాడుకుని ఇప్పుడు మైసాలో పెట్టిన తీరు, దానికి రష్మిక మందన్న ఇచ్చిన పెర్ఫార్మన్స్ వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి.
రణబాలి తర్వాత తక్కువ గ్యాప్ లో వస్తున్న రష్మిక మందన్న సినిమా ఇది. పోటీగా శర్వానంద్ భోగి ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. మైసాలో యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పటిదాకా ఏ హీరోయిన్ చేయని స్థాయిలో ఉంటాయట. జాక్స్ బిజోయ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. అయితే సోలోగా రష్మిక భారీ ఓపెనింగ్స్ తెచ్చే స్థాయి ఉందో లేదో వచ్చే వారం తేలనుంది. ఒకవేళ సక్సెస్ ఫుల్ గా తేగలిగితే అనుష్క తర్వాత ఆ రేంజని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates