సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది కానీ ఇంకా నిర్మాణ సంస్థ వైపు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సెన్సార్ నుంచి ఏ వచ్చిందనే టాక్ ఆల్రెడీ తిరుగుతున్నా దానికి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చివరి దశ టచప్స్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనుల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బృందం తలమునకలై ఉంది. ఒక్కో నిమిషం బంగారం రేటు కన్నా విలువైందిగా మారింది.
ట్రైలర్ ఇవ్వకపోవడం పట్ల ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ నాని టీమ్ మాత్రం కంటెంట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పటికే సరిపడా బజ్ ఉందని ఒక వర్గం, లేదు నానిని తప్ప ఇంకే ఇతర ఆర్టిస్టులను వీడియోలో రివీల్ చేయలేదు కాబట్టి కామన్ ఆడియన్స్ లో దీని మీద అంచనాలు నెలకొనాలంటే ట్రైలరే ఆయుధమని మరికొందరు అంటున్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం నూటికి నూరు శాతం నిజం.
ఇక తెరమీద సినిమా చూపించే విషయంలో ది ప్యారడైజ్ నో కాంప్రోమైజ్ అన్న రేంజ్ లో మెప్పించాలి. మిక్స్డ్ టాక్, డివైడ్ టాక్ పని చేయవు. యునానిమస్ అనిపించుకోవాలి వేరే ఆప్షన్ లేదు. పుష్ప, కెజిఎఫ్ రేంజ్ లో అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అది నిజమైతే మటుకు నానినే మళ్ళీ సాధిస్తాడో లేదోనే స్థాయిలో నెంబర్లు వస్తాయి. ఎలాగూ బాక్సాఫీస్ దగ్గర సందడి క్రమంగా తగ్గింది. ఇరుముడి వచ్చి నెలవుతున్న తరుణంలో బలమైన మాస్ బొమ్మ కోసం అందరూ వెయిటింగ్.
ఇంకా టికెట్ రేట్ల పంచాయితీ పెండింగ్ ఉంది. ప్రీమియర్లకు, మొదటి పది రోజుల షోలకు ఎంతో కొంత పెంపు ఉండాలని బయ్యర్ వర్గాలు కోరుతుండగా జూన్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలేవీ హైక్స్ తీసుకోకపోవడం ఎంత ప్లస్ అయ్యిందో వసూళ్ల సాక్షిగా ఋజువయ్యింది. కానీ బిజినెస్, బడ్జెట్ కోణంలో చూసుకుంటే ప్యారడైజ్ కి పెంపు తప్పకపోవచ్చేమో. ఏడాదికి పైగా నానిని స్క్రీన్ మీద మిస్సయిన ప్రేక్షకులకు ప్యారడైజ్ పేరుకు తగ్గట్టే అదిరిపోయే బిర్యానీ రేంజ్ లో ఉండాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates