గాడ్జిల్లా గల్లంతు అయ్యేలా ఉంది

తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు కానీ రేపు ఇంకో క్రేజీ మూవీ వస్తున్న సంగతే గుర్తురానంతగా వీక్ గా ఒక మూవీ నలిగిపోనుంది. అదే గాడ్జిల్లా మైనస్ జీరో. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల నవంబర్ 6 రిలీజైన ఈ మాన్స్ టర్ డ్రామా ఇండియాలో రామాయణ పార్ట్ 1 వల్ల రెండు వారాలు వాయిదా వేసుకుంది. సరిపడా ఐమాక్స్ స్క్రీన్లు అందుబాటులో లేవనే కారణం చూపించారు కానీ వాస్తవం ఏమిటో ట్రేడ్ వర్గాలకు తెలుసు.

కట్ చేస్తే గాడ్జిల్లా మైనస్ జీరోకి ఎక్కడా తగినన్ని షోలు కనిపించడం లేదు. అంత పెద్ద హైదరాబాద్ లో పరిమితంగా స్క్రీనింగ్ చేయడం చూస్తుంటే రాకాసి జంతువు గల్లంతు కావడం ఖాయమనిపిస్తోంది. విచిత్రం ఏమిటంటే చాలా చోట్ల జాపనీస్ వెర్షన్ ప్రదర్శించనున్నారు. తెలుగు తమిళ లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయకపోవడం సాధారణ ప్రేక్షకులను దూరం చేయనుంది. మూవీ లవర్స్ ఈ ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చూసే అవకాశం తగ్గిందని వాపోతున్నారు.

అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ భాష సినిమా అయినా వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ చేస్తే తప్ప వసూళ్లు వచ్చే సీన్ లేదు. అలాంటిది ఇలా రెండేసి వారాల గ్యాప్ ఇస్తే ఇలాగే అవుతుంది. రివ్యూల పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న గాడ్జిల్లా మైనస్ జీరో లాంగ్ రన్ లో దూకుడు చూపించలేదు. సెకండ్ వీక్ లో కలెక్షన్ల తగ్గుదల కనిపించడం బయ్యర్లను భయపెట్టింది. విఎఫ్ఎక్స్ పరంగా మొదటి భాగం కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ కంటెంట్ విషయంలో కొంచెం నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఈ లెక్కన జపాన్ గాడ్జిల్లా మీద మనవాళ్లకు మోజు తక్కువని అర్థమైపోయింది. ఈ సినిమాకు మరో సమస్య కూడా ఉంది. రామాయణ, సీన్ మూడో వారంలోనూ చాలా చోట్ల కొనసాగుతున్నాయి.. వాటికి కొత్త రిలీజులు తోడయ్యాయి. సహజంగానే బిసి సెంటర్స్ లో స్క్రీన్ల కొరత వచ్చేసింది. దీంతో కొన్నిచోట్ల అసలు రిలీజే లేకుండా పోతోంది. దీని సంగతేమో కానీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా మటుకు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.