ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎక్కడ చూసినా ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ హంగామానే కనిపిస్తోంది. ఈ సిరీస్ లో సినిమాలు రావడం కొత్త కాకపోయినా ఈసారి క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. నిన్న అల్లు మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో వేస్తే సామాన్య ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు భారీ ఎత్తున వచ్చారు. బన్నీ కుటుంబంతో సహా వచ్చేయగా ఎందరో ప్రముఖులు తమ ఎగ్జైట్ మెంట్ దాచుకోలేక బెనిఫిట్ షో కోసం క్యూ పట్టారు. భారీ ఓపెనింగ్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ 45 నుంచి 50 కోట్ల మధ్యలో ఉందని సమాచారం. బుక్ మై షోలో 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్, కౌంటర్ బుకింగ్ లెక్కలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా నేరుగా టికెట్లు ఎక్కువగా సేల్ అయ్యే బిసి సెంటర్ల అంకెలు షాక్ ఇచ్చేలా రాబోతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాదు జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు ఎక్కడ చూసినా ఇవాళ నాలుగు షోలకు దాదాపు అన్నీ హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
అత్యధికంగా 3డి స్క్రీన్లు ఇవ్వడంతో చిన్నపిల్లలు ఎగబడుతున్న వైనం ముఖ్యమైన సెంటర్లు అన్నింటిలోనూ చూడొచ్చు. ఇక ప్రీమియర్ టాక్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ గురించి అత్యధిక ప్రశంసలు దక్కుతున్నాయి. క్వాలిటీ విషయంలో మార్వెల్ మరోసారి తన సత్తా చాటిందని మూవీ లవర్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే యాక్షన్ కన్నా ఎక్కువగా ఎమోషన్ హైలైట్ అయ్యిందని, దానికి ముందే సిద్ధమై వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చనేది ఆడియన్స్ మాట.
ఇవాళ నుంచి రెగ్యులర్ షోలు పడుతున్నాయి కాబట్టి అసలైన టాక్ మధ్యాన్నం లోపు బయటికి వచ్చేస్తుంది. పలు చోట్ల ఉదయం 9 గంటలకే షోలు మొదలుపెట్టడం చూస్తే స్పైడర్ మ్యాన్ క్రేజ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు అనిపిస్తోంది. మంచి ఊపులో ఉన్న చెన్నై లవ్ స్టోరీతో పాటు ఫ్రెష్ గా రిలీజైన శ్రీనివాస మంగాపురం ఓపెనింగ్స్ దీని వల్ల ప్రభావితం చెందేలా ఉన్నాయి. అన్నట్టు బ్రాండ్ న్యూ డే మూవీ స్పైడర్ మ్యాన్ సిరీస్ లో ఆఖరుది కాదంట. ఇంకా వస్తూనే ఉంటాయి.
This post was last modified on July 30, 2026 1:02 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…