Political News

జెన్ జీ బాటలో రాజకీయ పార్టీలు

నీట్ పేపర్ లీకేజిపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన జంతర్ మంతర్ ఆందోళన విజయవంతం కావడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇపుడు జెన్ జీ బాటలో నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలో వున్న పార్టీలు తమ అధికారం నిలుపుకునేందుకు, ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జెన్ జీ మార్గం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈదారిలో ఒక అడుగు ముందున్నాయి.

21 ఏళ్ళకే ఎన్నికల్లో పోటీ…..

ఇపుడు దేశమంతా జెన్ జీ గురించి మాట్లాడుతోంది. ఎవరికీ తలవంచని మోడీ ప్రభుత్వం జెన్ జీ ఉద్యమం ముందు చేతులెత్తేయడంతో యువత బలమేంటే దేశానికి తెలిసొచ్చింది. దీనికి ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు 25 ఏళ్ళ నుంచి 21కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా ఈ ప్రతిపాదనతో అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించడం ద్వారా యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉలిక్కి పడింది. ఇపుడు బీఆర్ఎస్ నాయకులు కూడా జెన్ జీ గురించి మాట్లాడ్డం మొదలెట్టారు. జెన్ జీ తరహాలో ఉద్యమిస్తేనే హక్కులు సాధించగలుగుతామని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూధనా చారి బీసీ సంఘాల సమావేశంలో ప్రకటించారు. ఇతారా నాయకులు సైతం జెన్ జీ జపం చేస్తున్నారు.

డీఎస్సి అక్రమాలపై వైసీపీ పోరు….

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జెన్ జీ పై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఇక్కడ వైసీపీ జెన్ జీ స్పూర్తితో రాజకీయం మొదలెట్టింది. డీఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆమధ్య కొంత కాలం మాట్లాడి వదిలేసిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది.

నీట్ పేపర్ లీకేజి వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే డీఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది. తద్వారా యువకులు, విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది కనుక జెన్ జీ ఉద్యమ ప్రభావం అప్పటిదాకా పనిచేస్తుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on July 30, 2026 1:13 pm

Share

Recent Posts

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

4 minutes ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

13 minutes ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

37 minutes ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

1 hour ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

2 hours ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

2 hours ago