Movie News

విశ్వనాథ్  వాటిని మ్యాచ్ చేయాల్సిందే

వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి బ్రాండ్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం కావడంతో అంచనాల పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ దీని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆగస్ట్ 2 చెన్నైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. దాని తర్వాత హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు.

ఇదంతా ఓకే కానీ విశ్వనాథ్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏమిటంటే ఇదో కంప్లీట్ ఎంటర్ టైనర్ లా ఉంటుందని సామాన్య ప్రేక్షకులు భావిస్తున్నారు. అంటే ఒక కలిసుందాం రా తరహాలో ఫుల్ ప్యాకేజీ అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే బయ్యర్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం టైటిల్ ని బట్టి స్టోరీ మీద అంచనాకు వచ్చేయకూడదని టీజర్ లోనే కథ చెప్పడం చూశాం. పాతికేళ్ల అమ్మాయి, నలభై వయసున్న వ్యక్తిని ప్రేమించడమే ఇందులో మెయిన్ పాయింట్.

అలాంటప్పుడు విశ్వనాథ్ ఆండ్ సన్స్ పేరు ఎందుకు పెట్టారు, పోస్టర్లలో చూపించిన చిన్న బాబు కాకుండా ఇంకెవరైనా సూర్యకు సంతానం ఉన్నారా, పిల్లల తండ్రిని మమిత బైజు ప్రేమించినట్టు వెంకీ రాసుకున్నారా లాంటి ఎన్నో ప్రశ్నలు థియేటర్లో ఎదురు చూస్తున్నాయి. రాధికా శరత్ కుమార్, రవీనాటాండన్ లాంటి సీనియర్లు ఇందులో పెద్ద పాత్రలే చేశారు. జివి ప్రకాష్ సంగీతంలో మొదటి పాట మంచి హిట్ కాగా సూర్య పాడిన రెండో సాంగ్ కు ఏమంత స్పందన లేదు.

వీరభద్రుడు / కరుప్పు బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్న సూర్యకు ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో దాన్ని మ్యాచ్ చేయడమో లేదా క్రాస్ చేయడం ద్వారా తన మార్కెట్ ని మరింత పటిష్ట పరుచుకోవచ్చు. కానీ ఇలాంటి క్లాస్ మూవీతో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమా అనేది అసలు ప్రశ్న. అల వైకుంఠపురములో తరహా ట్రీట్ మెంట్ ఉంటుంది కాబట్టి కంటెంట్ కనెక్ట్ అవుతుందా లేదానే భయం అక్కర్లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే సంతోషమే. 

This post was last modified on July 29, 2026 3:33 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

32 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

39 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

43 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago