త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ దర్శకుడయ్యాక మాత్రం రెండు దశాబ్దాల పాటు వెంకీతో పని చేయలేదు. చాలా ఏళ్ల ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా చేయాల్సింది కానీ.. అది అనౌన్స్‌మెంట్ తర్వాత పట్టాలెక్కలేదు. ఐతే ఎట్టకేలకు ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో వీరి కలయికలో సినిమా రాబోతోంది.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబరు 2న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీం ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. సినిమాలో కీలకమైన ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వీడియోలు వదులుతోంది. ఐతే అవి అంచనాలకు తగ్గట్లు లేవని, త్రివిక్రమ్ మార్కు మిస్సయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో ‘ఆదర్శ కుటుంబం’ గురించి తమన్ మాట్లాడాడు. ఈ సినిమా ఎడిట్ రూం ఒక లాఫింగ్ క్లబ్‌లా మారిపోయిందని, అంతగా ఈ సినిమాలో వినోదం ఉంటుందని తమన్ చెప్పాడు. ఎడిట్ రూంకు ఎవ్వరు వెళ్లినా నవ్వుతూనే ఉంటారని.. త్రివిక్రమ్ అంత ఫన్‌తో ఈ సినిమాను నింపేశాడని తమన్ అన్నాడు. త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావు’ రోజుల్లోకి వెళ్లిపోయి ఈ సినిమాకు రచన చేశాడని, ‘ఆదర్శ కుటుంబం’ నాన్ స్టాప్‌గా నవ్విస్తుందని అతను చెప్పాడు. ఈ సినిమా సంగీతం కూడా చాలా స్పెషల్ అని తమన్ చెప్పాడు.
పాటలకు భలే సిచువేషన్లు కుదిరాయని.. ప్లెజెంట్ సాంగ్స్ చేశానని.. ‘అల వైకుంఠపురములో’ తరహాలో పాటలు భలేగా ఉంటాయని తమన్ చెప్పుకొచ్చాడు. బ్యాగ్రౌండ్ సాంగ్స్‌తో కథను నరేట్ చేయడం తెలుగులో తానే మొదలుపెట్టానని.. ‘సిత్తరాల సిరపడు’ అందుకు ఉదాహరణ అని.. ఇప్పుడు ‘దురంధర్’ లాంటి సినిమాల్లోనూ అలాంటి ప్రయత్నమే చేశారని.. ‘ఆదర్శ కుటుంబం’లో కూడా అలా కథను డ్రైవ్ చేసే బ్యాగ్రౌండ్ సాంగ్స్ ఉంటాయని తమన్ తెలిపాడు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రోమోలు సందేహాలు రేకెత్తిస్తుంటే.. తమన్ మాత్రం ఈ సినిమా గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి అంచనాలు ప్రయత్నం చేస్తున్నాడు.
This post was last modified on July 29, 2026 10:54 pm
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…