Movie News

కుర్రాడికి అభిమానుల అండ దొరికిందా

రేపు శ్రీనివాస మంగాపురం విడుదల కానుంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా తన మీద పెద్ద బాధ్యత ఉంది. మహేష్ బాబు రాజకుమారుడు విడుదలైన జూలై 30 దీన్ని రిలీజ్ చేయడం సమర్పకులు అశ్వినిదత్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ విషయాన్ని మహేష్ తన వీడియో బైట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అన్న కొడుకు కోసం మహేష్ బాబు ప్రత్యక్షంగా ఎలాంటి ఈవెంట్ లో పాల్గొనకపోవడం కొన్ని విమర్శలు తెచ్చి పెట్టింది.

జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కొన్నేళ్ల క్రితం కాలం చేశారు. తాత కృష్ణ చనిపోయి సంవత్సరాలు దాటేసింది. నాన్నమ్మ కూడా లేదు. తల్లికి సినిమా రంగంతో నేరుగా పరిచయం ఆశించలేం. సో ఎటు చూసినా తోడు ఉండాల్సింది బాబాయ్ మహేష్ బాబే. ఏదైనా వేడుకకు ప్రత్యక్షంగా వచ్చి నాలుగు మాటలు చెప్పి ఉంటే బజ్ పెరిగేదని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ ని వారణాసికి తప్ప వేరే పబ్లిక్ ఈవెంట్ లో చూడలేదు.

సరే మహేష్ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్ రంగంలోకి దిగి శ్రీనివాస మంగాపురంకు మైలేజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్ని చోట్ల ఉదయం బెనిఫిట్ షోలు తద్వారా సెలెబ్రేషన్స్ తో పాటు కుర్రాడికి తమ సపోర్ట్ ఉందనే సందేశం ఇస్తున్నారు. సీనియర్ అభిమానులకు రమేష్ బాబు బాగా గుర్తు. సామ్రాట్ నుంచి ఎన్ కౌంటర్ దాకా ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఒక నటుడిగా కృష్ణగారబ్బాయిగా ఆ గౌరవాన్ని ఇప్పటికీ పెట్టుకున్నారు.

సో ఇక ఆసలు బాధ్యత దర్శకుడు అజయ్ భూపతి మీద ఉంది. కమర్షియల్ ఫార్మాట్ లో ప్రేమకథ చెప్పబోతున్న వైనం ట్రైలర్ లో కనిపించేసింది. మోహన్ బాబు అంతటి సీనియర్ హీరో ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారంటే మ్యాటర్ ఉండే ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు మరీ వైరల్ కాకపోవడంతో బజ్ కొంచెం అటుఇటు అవుతోంది. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రష తదాని ఈ సినిమాతోనే పరిచయమవుతూ డెబ్యూనే పెద్ద బ్రేకవుతుందని ఎదురు చూస్తోంది.

This post was last modified on July 29, 2026 11:00 am

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

17 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

24 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

28 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

50 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago