Trends

పేద విద్యార్థిని బలిగొన్న మంచి మార్కులు

మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది.

జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో కుమారుడు రెండో కుమారుడు తరుణ్ (17)జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తొలి నుంచి చదువులో రాణించే తరుణ్ ఇంటర్ 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించిన జిల్లాలో రెండో ర్యాంక్ సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ కాలేజీలో చదువుతూ జిల్లా ర్యాంకు సాధించిన తరుణ్ ను గ్రామస్టులు అభినందనలు తెలిపారు.

ఫస్ట్ ర్యాంకర్ తో పోలుస్తూ అవమానించిన లెక్చరర్…
ర్యాంకులు, మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సాహించాలన్న కనీస విజ్ఞత లోపించిన ఒక మహిళా లెక్చరర్ తరుణ్ ను అవమానించడం మొదలుపెట్టింది. తరచుగా 435 మార్కులు సాధించిన విద్యార్థితో పోల్చడం, దూషిస్తూ నలుగురి ముందు కించపరిచడం చేస్తుంది. అలా హేళన చేయవద్దని తరుణ్ బతిమాలాడు, అభ్యంతరం వ్యక్తం చేసాడు.

దాంతో అహం దెబ్బతిన్న లెక్చరర్ విద్యార్థుల ముందు చేయి చేసుకోవడమే కాకుండా నీవేమైనా మంత్రి కొడుకువా అంటూ మాట్లాడ్డంతో తరుణ్ హృదయం గాయపడింది. లెక్చరర్ వేధింపులను తట్టుకోలేక చావే నయమని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న బిడ్డ మృతితో బుచ్చన్న దంపతులు విషాదంలో మునిగిపోయారు.

లెక్చరర్ తీరుపై ఆగ్రహం..
మహిళా లెక్చరర్ వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతురాలైనప్పటికి చాలా చీప్ గా బిహేవ్ చేశారని నేటిజన్లు మండి పడుతున్నారు. తరుణ్ ఆత్మహత్యకు కారకురాలైన లెక్చరర్ మీద హత్య కేసు నమోదు చేయాలని కొత్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

పోలికలు వద్దని చెప్పినా…
విద్యార్థులను ఒకరితో మరొకరిని పోల్చవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసికంగా కుంగి పోతారని, తామెందుకూ పనికిరామని ఆత్మన్యూన్యత గురవుతారని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆత్మహత్యలకు పాలడతారని చెబుతున్నారు. విద్యార్థులను ఇరులతో పోల్చడం సామాజిక నేరంగా పరిగణించాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on July 29, 2026 11:16 am

Share

Recent Posts

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

6 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

24 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago