సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం. జాన్వీ కపూర్ పాత్ర మీద విమర్శలను వెంటనే పరిగణనలోకి తీసుకున్న దర్శకుడు బుచ్చిబాబు వాటిని సరిచేయాలనే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. వీటి సంగతి ఎలా ఉన్నా కింది స్థాయి బిసి సెంటర్స్ లో పెద్ది వసూళ్లు భారీగా ఉన్నాయి. రెండో రోజు కన్నా మూడో రోజు ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉన్నాయని ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాట.
పోస్ట్ రిలీజ్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు చెబుతున్న కొన్ని విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. వాటిలో మొదటిది ముఖ్యమైన సీన్లను ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేయడం. జాన్వీ కపూర్ కు పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలుసుకుని కుస్తీ ప్రాక్టీస్ లో ఉన్న పెద్ది ఉన్న ఫళంగా లంగోటా మీద సైకిల్ మీద అక్కడికెళ్ళిపోయి ఆప్ ప్రయత్నం చేస్తాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్, రావు రమేష్, జాన్వీ కపూర్ మధ్య చాలా ఇంటెన్స్ సంభాషణలు జరుగుతాయి.
ఇదంతా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎగిరిపోయింది. కారణాలు ఏమైనా ఇలాంటి మంచి సీన్ తీసేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎక్కడైనా కొంచెం లెన్త్ తగ్గించి దీన్ని పెట్టి ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సన్నివేశమే రంగస్థలంలో ఉంది కాబట్టి ఇక్కడ వద్దనుకున్నారో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ సెకండాఫ్ లో జాన్వీ చాలాసేపు కనిపించకపోవడం వెనుక గుట్టు అయితే దొరికేసింది.
ఇదే కాదు గద పట్టుకుని హనుమంతుడిలా రాత్రి షాట్ లో స్టిల్ ఇచ్చే పెద్దితో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ఉందని ఇన్ సైడ్ టాక్. అదేంటో బుచ్చిబాబు బయట పెట్టలేదు కానీ సీరియస్ కథల్లో మరీ ఎక్కువ కమర్షియల్ అంశాలు ఇబ్బందవుతుందని భావించారేమో కానీ మొత్తానికి కొంత నష్టమైతే జరిగింది. వీటిని మళ్ళీ ఎడిట్ చేసి జోడించే అవకాశం దాదాపుగా లేకపోయినా థియేటర్ రన్ అయ్యాక డిలీటెడ్ కంటెంట్ లాగా యూట్యూబ్ లోనో లేదా ఓటిటి వెర్షన్ లోనో వదిలితే బాగుంటుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates