బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి రాకపోవడం, వచ్చిన వాటి పట్ల అంతగా ఉత్సాహం కనిపించకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ సైతం టికెట్లు కొనడం లేదు. ఈ నేపథ్యంలో ఇంకో శుక్రవారం అయితే మొదలయ్యింది కానీ ఎగ్జిబిటర్ల ఆకలి కేకల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కూల్ సమ్మర్ అంటూ హడావిడి చేసిన గోదారి గట్టుపైన ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుమంత్ ప్రభాస్ కు పెద్దగా ఇమేజ్ లేకపోవడం వల్ల ఏమంత హైప్ లేదు. ముందురోజు రాత్రి హైదరాబాద్ లో ప్రీమియర్లు వేశారు. టాక్ మిక్స్డ్ గా ఉన్నా ఏ మేరకు నిలబడుతుందనేది వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇదే సుమంత్ ప్రభాస్ మేం ఫేమస్ కి మూడేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్లు వేస్తే ఈసారి హైదరాబాద్ తో పాటు 8 కేంద్రాలకు పరిమితం చేయడం గమనార్హం. రవిబాబు రేజర్ కూడా ఏమంత ప్రభావం చూపించలేక ఓపెనింగ్స్ విషయంలో వెనుకబడి ఉంది. సతి లీలావతిది అదే కథ.
ఈ సినిమాలన్నీ బాగున్నాయా లేదా అనేది కాదు డిస్కషన్. అసలు మొదటి రోజు ఖచ్చితంగా సినిమాలు చూసే అలవాటున్న జనాలు సైతం థియేటర్లకు ఎందుకు దూరంగా ఉన్నారనేది. ఎండలు, ఐపీఎల్ ప్రభావం ఉంది కానీ పూర్తిగా అయితే కాదు. సరైన మూవీ ఉందంటే ఇప్పటికిప్పుడు హౌస్ ఫుల్స్ పెట్టేంత ప్రేమ తెలుగు ఆడియన్స్ ది. టాక్ కొంచెం అటు ఇటు ఊగినా కూడా డెకాయిట్ తెచ్చిన కలెక్షన్లే దానికి నిదర్శనం. శేష్ బ్రాండ్ తాలూకు ఫలితం అది.
గతంతో పోలిస్తే ఇప్పటి పబ్లిక్ మారిపోయిన మాట వాస్తవమే. ఓటిటిలు, పైరసీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఎగ్జైట్ మెంట్ అనిపించేలా ఎవరూ సరైన కంటెంట్ తో రాకపోవడమే అసలు సమస్య. జూన్ 4 ఇంకా పాతిక రోజుల దూరంలో ఉంది. అప్పటిదాకా థియేటర్ ఫీడింగ్ జరగాలి. ఇవాళ వచ్చినవి ఒక వారం దాకా ఎంతో కొంత నిలబడితే ఊరట దక్కుతుంది. లేదంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ముందైతే రిలీజ్ డే మార్నింగ్ షో హౌస్ ఫుల్ చేసే సినిమా జూన్ 4 కన్నా ముందు వస్తుందో రాదో చూడాలి.
This post was last modified on May 8, 2026 6:16 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…