టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి టికెట్ ధరల పద్దతిని అమలు చేయాలని కోరతారట. అంటే 100 నుంచి 1000 రూపాయల మధ్య ఎంత రేట్ పెట్టాలనేది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఎలాంటి జిఓలు అవసరం ఉండదు. నేరుగా ధరలు పెంచుకుని బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు.
వినడానికి బాగానే ఉంది ఈ పద్దతి హైదరాబాద్ లాంటి నగరాలకు వర్కౌట్ అయినా బిసి సెంటర్స్ లో అంత సులభంగా స్పందన తెచ్చుకుంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే రెగ్యులర్ రేట్లకే జనాలు థియేటర్లకు రావడం మానేశారు. కంటెంట్ ఏదో ఎక్స్ ట్రాడినరిగా ఉందని టాక్ వస్తే తప్ప టికెట్లు బుక్ చేసుకుని బయటికి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు పర్మిషన్లు లేకుండా డైరెక్ట్ గా పెంపు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.
ఇందులో ఒక రిస్క్ పొంచి ఉంది. ఇలాంటి సిస్టమ్ వస్తే కనక మల్టీప్లెక్సులకు పగ్గాలు ఉండవు. వీకెండ్స్ లో భారీగా పెంచేస్తారు. ఉదాహరణకు శని ఆదివారాలు 500 రూపాయలు ఉన్న టికెట్ రేట్ బుధవారానికి 1000 రూపాయలకు పెరగవచ్చు. క్రేజ్ ఉన్న స్టార్ హీరోలవి హిట్ టాక్ ని బట్టి రోజు అధిక ధరలను ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. బెంగళూరు, ముంబై మల్టీప్లెక్సుల్లో కొన్ని హాలీవుడ్ మూవీస్ మొదటి రోజు టికెట్ రెండు వేల రూపాయల దాకా ఉంటోంది.
ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చు. కానీ నియంత్రణ లేని టికెట్ రేట్ల వల్ల చివరికి దాన్ని భరించే బాధ్యత థియేటర్ కు వచ్చే మధ్య తరగతి ప్రేక్షకుల మీద ఉంటుంది. ఇప్పటికే మిడిల్ క్లాస్ బ్యాచ్ లు సినిమాలకు రావడం బాగా తగ్గించాయి. ఇప్పుడు కనక క్యాప్ ఎత్తేసి ఫ్లెక్సీ ప్రైజింగ్ పేరుతో కొత్త ఎత్తుగడ వేస్తే ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రతి సినిమాను థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే, హార్డ్ కోర్ లవర్స్ కు మాత్రం ఇది శరాఘాతమే.
This post was last modified on May 8, 2026 5:15 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…