Movie News

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే వచ్చాయి. అడవిరాముడు, పోకిరి, ఘరానా మొగుడు, భైరవ ద్వీపం, హలో బ్రదర్, యమలీల ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకు అంతుపొంతు ఉండదు. ఇవన్నీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలే. కానీ గత కొన్నేళ్లుగా ఏప్రిల్ వైభవం మసకబారుతోంది. చెప్పుకోదగ్గ మూవీస్ లేక బయ్యర్లు డీలాపడుతూ, థియేటర్లు భోరుమంటూ నీరసం తెప్పిస్తున్నాయి.

గత పాతికేళ్ల ఏప్రిల్ ట్రాక్ రికార్డు 2000 నుంచి 2021 దాకా చూసుకుంటే బద్రి, ఖుషి, వాసు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, నేనున్నాను, బన్నీ, ఢీ, జల్సా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సింహ, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిల్లా, రచ్చ, బాద్షా, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, బాహుబలి 2, భరత్ అనే నేను, చిత్రలహరి, జెర్సీ మొదలైన సూపర్ హిట్స్ అన్నీ ఈ నెలలో వచ్చి అద్భుత విజయం అందుకున్నాయి. తర్వాతే బొమ్మ రివర్స్ అవుతోంది.

సరైన సినిమాలు లేకపోవడం వల్ల క్రమంగా ఏప్రిల్ నెల డ్రైగా మారిపోతోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. విమర్శకులు మెచ్చుకున్న బైకర్ బలంగా హిట్ అని చెప్పలేని కలెక్షన్లు వచ్చాయి. తెగ హడావిడి చేసిన రాకాస ఉన్నట్టుండి నెమ్మదించి బ్రేక్ ఈవెన్ టచ్ కాగానే ఆగిపోయింది. బ్రేక్ ఈవెన్ దాటేసి కాస్త లాభాలిచ్చి డెకాయిట్ ఊరట కలిగించింది కానీ అదిరిపోయే అద్భుతాలు జరగలేదు. తిమ్మరాజుపల్లి టివికు ప్రమోషన్లు గట్టిగా చేసినా లాభం లేకపోయింది, ఇక పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తీక్ సంగతి సరేసరి. రెండో రోజే టపా కట్టేశాయి.

ఐపీఎల్, ఎండలు కొంత మేర ప్రభావం చూపిస్తున్నాయి కానీ సరైన సినిమా వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు క్యూ కడతారని పైన చెప్పిన ఉదాహరణలు పదే పదే రుజువు చేస్తూ వచ్చాయి. పెద్ది ఏమైనా మేజిక్ చేస్తుందేమో అనుకుంటే అదేమో ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. క్రమంగా వేసవిలో ఎంతో కీలకమైన ఏప్రిల్ ఇలా జ్వరం వచ్చిన పేషెంట్ లా మారిపోవడం మూవీ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని 2027లో వారణాసి బ్రేక్ చేయాల్సిందే.

This post was last modified on April 22, 2026 8:17 am

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

13 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

5 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

8 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

8 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

8 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago