తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత వీరి సొంతం. వీరి స్థాయిని అందుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఐతే వీరి లెవెల్ కాకపోయినా.. వీరి తర్వాత తెలుగు పాట స్థాయి పడిపోకుండా చూస్తున్న గేయ రచయితల్లో చంద్రబోస్ ఒకరు. 90వ దశకం నుంచి చంద్రబోస్ పాటల ప్రయాణం నిరాటంకంగా సాగుతోంది.
తన తర్వాత ఎంతోమంది యువ లిరిసిస్టులు వచ్చినా.. చంద్రబోస్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న ఘనత చంద్రబోస్‌ది. ప్రస్తుతం సుకుమార్ సహా కొందరు అగ్రశ్రేణి దర్శకులు చంద్రబోస్‌తోనే పాటలు రాయించుకుంటారు. తాజాగా చంద్రబోస్ పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే ‘భోగి’ సినిమాకు పాటలు రాశారు. వాటికి మంచి స్పందన వస్తోంది.
ఈ నెల 27న ‘భోగి’ విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాను కలిసిన చంద్రబోస్.. తన కెరీర్లో అత్యంత వేగంగా, ఈజీగా రాసిన పాట గురించి.. అలాగే అత్యధిక సమయం కష్టపడిన పాట గురించి వెల్లడించారు. ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే పాట తన కెరీర్లో అత్యంత తక్కువ సమయంలో పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. ఆ పాటను కేవలం 40 నిమిషాల్లోనూ పూర్తి చేశానన్నారు.
ఇక అత్యధిక సమయం పట్టిన పాట ఆస్కార్ అవార్డు అందుకున్న ‘నాటు నాటు’ నే అని చంద్రబోస్ తెలిపాడు. ఈ పాటకు 19 నెలల టైం పట్టిందని ఆయన వెల్లడించారు. ఈ పాట ఫస్ట్ వెర్షన్ త్వరగానే రాసినప్పటికీ.. తర్వాత ఈ పాట కంపోజిషన్‌కు టైం పట్టడం, మార్పులు చేర్పులు, మధ్యలో కోవిడ్ వల్ల.. ఫైనల్ వెర్షన్ పూర్తవడానికి 19 నెలలు పట్టిందని చంద్రబోస్ తెలిపారు. రాజమౌళి కోరిక మేరకు ‘భూమి దద్దరిల్లేలా’ లాంటి కొత్త పదాలు పాటలో యాడ్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పాటకు ఆస్కార్ రావడం గురించి స్పందిస్తూ.. తన సహనానికే ఆ అవార్డు వచ్చిందోమో అని చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
This post was last modified on November 22, 2026 1:02 pm
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అపరిచిత భక్తుడు భారీ కానుక సమర్పించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…
డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…
కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…
‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…