డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే రాజ్యమైపోయింది. ఇప్పుడు ఎవరు ఔనన్నా కాదన్నా ఏఐతో మెరుపు వేగంలోకి వచ్చిపడ్డాం. ఆధునిక యువతరం అంతా బీటెక్, ఐఐటీల వెంట పరుగులు తీస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. మధ్యతరగతి ప్రజలు స్థాయికి మించి అప్పో సప్పో చేసి చదిస్తుండగా, హై ప్రొఫైల్ పెద్దలు లక్షల ఫీజులు చెల్లించి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివిస్తున్నారు. అయితే డిగ్రీల కంటే నైపుణ్యం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మన ప్రధాన మంత్రి కూడా అదే స్పష్టం చేయడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన 5వ జాతీయ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఐటిఐ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో కేవలం కాగితపు డిగ్రీలు వుంటే సరిపోదని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద యూనివర్శిటీలు ఇచ్చే పట్టాలకంటే పనితనం వున్న వారికే రాబోయే రోజుల్లో విలువ, డిమాండ్ ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. చేతి వృత్తులకు ప్రపంచం చేయెత్తి జై కొడుతోందన్నారు. మా దేశాల్లోని ఆధునిక నగరాలు మా డబ్బుతో నిర్మించినవి కావు, భారతీయ కళాకారులు, కార్మికుల కష్టంతో నిర్మితమైనవని సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాల రాజకుటుంబీకులు తనతో కలిసినప్పుడల్లా చెబుతుంటారని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి దేశ విదేశాల్లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయని, అయితే చేతి పనితనం, వృత్తిపరమైన నైపుణ్యం ఉన్నవారి ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయలేదని ప్రధాని స్పష్టం చేశారు. ఐటీఐ, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి యూనివర్సిటీ డిగ్రీలు పొందిన వారితో సమానంగా సమాజంలో గౌరవం దక్కాలన్నారు. లక్నోలోని ‘చికంకారీ’ వంటి సంప్రదాయ కళలే భారతదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చాయని కొనియాడారు.
ప్రధాని మోదీ చెప్పింది అక్షరాలా నిజం. అయితే నేటి సమాజానికి ఆయన మాటలు చెవికెక్కే సూచనలు కానరావడం లేదు. అంగడిలో చదువులను కొనడానికి తలిదండ్రులు పోటీ పడుతున్నారు. ఐటిఐ కంటే ఐఐటీ మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లల ఇష్టాయిస్టాలను పట్టించుకునే ఓర్పు లేకుండా పోతుంది. నైపుణ్యం లేకపోయినా సరే చేతిలో డిగ్రీ వుంటే చాలన్న భ్రమల్లో తలిదండ్రులు బతికేస్తున్నారని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 22, 2026 4:50 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…
తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…
‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…
మనుషులు చేసే పనులను యంత్రాలు కూడా చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా కార్లలో వస్తున్న స్మార్ట్ టెక్నాలజీ డ్రైవింగ్ అనుభవాన్నే మార్చేస్తోంది. ఒకప్పుడు…