Political News

తిరుమల చరిత్రోలోనే అత్యధికం… 121 కిలోల బంగారం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అపరిచిత భక్తుడు భారీ కానుక సమర్పించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలు స్వామివారికి సమర్పించిన ఆయన తన బయటపెట్టొద్దని కోరడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ప్రకటించారు.

చెన్నైకి చెందిన ఒక వ్యక్తి అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అక్కడే ఐటీ కంపెనీలు స్థాపించి సక్సస్ అయ్యారు. ఇటీవల ఆయన తన కంపెనీలో 60 శాతం వాటా విక్రయించారు. మిగిలిన 40 శాతం తన వద్దే ఉంచుకున్నారు. 60 శాతం వాటా విక్రాయించగా ఆయనకు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.

తాను వ్యాపారంలో విజయం సాధిస్తే స్వామివారికి భారీ కానుక సమర్పిస్తానని ఆయన ఎన్నో ఏళ్ల క్రితం మొక్కుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆయన పెట్టిన ఐటీ కంపెనీ అనతికాలంలోనే విజయంతం అయ్యింది. వేల కోట్లకు ఎదిగింది. ఎంత ఎదిగినా ఆయన మాత్రం స్వామి వారికి చేసుకున్న మొక్కును మరిచిపోలేదు. తాను సంపాదించిన సంపద అంతా స్వామి వారు ఇచ్చింది కనుక ఆయనకు తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. 

స్వామి వారికి ఏమేమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని సన్నిహితులు, పండితుల సలహాలు తీసుకున్నాడు. తిరుమల గర్భగుడిలోని మూలవిరాట్టుకు నిత్యం అలంకరించే బంగారు ఆభరణాల మొత్తం బరువు సుమారు 120 కిలోలు ఉంటుందన్న విషయం తెలుసుకున్నాడు. ఆ బరువుకు సరిసమానంగా 121 కిలోల బంగారాన్ని సమర్పించాలని ఆయన సంకల్పించారు. అనుకున్నదే తడువుగా కార్యరంగంలోకి దూకాడు. 

స్వామి వారికి కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలు వంటి 45 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇవి మొత్తం తొమ్మిది సెట్లు వుంటాయి. దేశ విదేశాల్లో పేరున్న నిపుణులు చేత సుమారు 15 నెలల పాటు శ్రమించి ఈ ఆభరణాలను తయారు చేయించారు. వీటి విలువ సుమారు రూ. 150 కోట్ల నుండి రూ. 160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వ్యక్తిగతంగా ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఎవరూ కానుక ఇవ్వలేదనే చెప్పాలి. తిరుపతి చరిత్రలో ఇదే పెద్ద కానుక.

ఈ నెల 26న తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వీటిని టీటీడీ అధికారులకు అధికారికంగా అందజేయనున్నారు.

This post was last modified on November 22, 2026 5:35 pm

Share

Recent Posts

డిగ్రీల కంటే చేతి వృత్తులకే విలువ ఎక్కువ – ప్రధాని మోదీ

డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…

56 minutes ago

శర్వానంద్‌కి ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది

కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…

3 hours ago

ఆ పాటకు 40 నిమిషాలు… ఈ పాటకు 19 నెలలు

తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…

4 hours ago

అనుమానాలు తీర్చేసిన వృషకర్మ

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…

4 hours ago

దుల్కర్ సల్మాన్… ఏమిటీ విచిత్రం?

కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…

5 hours ago

సుడిగాలి సుధీర్‌పై 15 కోట్లా?

‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…

5 hours ago