Movie News

శర్వానంద్‌కి ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది

కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి సెన్సార్ ఇష్యూ వల్ల నవంబర్ 27కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ల కోసం ఇంకొంచెం ఆలస్యంగా వద్దామనే ఆలోచన చేశారట కానీ డిసెంబర్ కూడా ప్యాకయిపోవడంతో నిర్ణయం మార్చుకోలేదని తెలిసింది. అయినా సరే శర్వాకు మేలు జరిగింది. ఎందుకంటే ఇదే తేదీకి అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్న రెండు సినిమాలు వాయిదా పడ్డాయి కాబట్టి.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హైందవ మీద చెప్పుకోదగ్గ బజ్ ఉంది. మిస్టిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. ఇంత కాన్వాస్ ఉన్న మూవీని హడావిడి పడి చేయడం కన్నా కొంచెం నెమ్మదియా వద్దామనే ఉద్దేశంతో ఫిబ్రవరికి వెళ్లొచ్చనే టాక్ బలంగా ఉంది. రష్మిక మందన్న మైసా కూడా తప్పుకోవడం శర్వాకు కలిసి వచ్చే విషయమే. ఈ రెండు సినిమాల కోసం లాక్ చేసుకున్న థియేటర్లలో అధిక శాతం భోగికి ఇస్తున్నారు.

ఇలా ఓపెన్ గ్రౌండ్ దొరకడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అరుదు. ఎందుకంటే టాక్ తో సంబంధం లేకుండా ఓమ్ వల్ల ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార ఎఫెక్ట్ అవ్వడం ఇటీవలే చూశాం. పాజిటివ్ టాక్స్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల వసూళ్ల పరంగా ప్రభావితం చెందాల్సి వచ్చింది. భోగికి అలాంటి ఇబ్బందేం లేదు. అసలే మాస్ కంటెంట్. పైగా రచ్చ, గౌతమ్ నందా, సీటిమార్ లాంటి పీక్ కమర్షియల్స్ ఇచ్చిన సంపత్ నంది దర్శకుడు. సో అంచనాలు  పెట్టుకోవచ్చు.

కెరీర్ లో మొదటిసారి ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్న శర్వానంద్ ఈ భోగి కోసం చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ గురించి మరీ మరీ చెబుతున్నారు యూనిట్ సభ్యులు. ఆపై వారం నాగచైతన్య వృషకర్మ ఉన్నా సరే భోగి కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా రెండో వారంలో హోల్డ్ కావొచ్చు. ఐదుగుదురు చెల్లెళ్లకు అన్నయ్యగా నటిస్తున్న శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు . భోగి వచ్చిన నెలన్నరలోపే శర్వా మరో సినిమా జార్జ్ క్రిష్ రిలీజవుతుంది. 

This post was last modified on November 22, 2026 2:22 pm

Share

Recent Posts

తిరుమల చరిత్రోలోనే అత్యధికం… 121 కిలోల బంగారం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అపరిచిత భక్తుడు భారీ కానుక సమర్పించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…

29 minutes ago

డిగ్రీల కంటే చేతి వృత్తులకే విలువ ఎక్కువ – ప్రధాని మోదీ

డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…

1 hour ago

ఆ పాటకు 40 నిమిషాలు… ఈ పాటకు 19 నెలలు

తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…

4 hours ago

అనుమానాలు తీర్చేసిన వృషకర్మ

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…

5 hours ago

దుల్కర్ సల్మాన్… ఏమిటీ విచిత్రం?

కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…

5 hours ago

సుడిగాలి సుధీర్‌పై 15 కోట్లా?

‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…

5 hours ago