కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ దిశగా హింట్స్ ఇచ్చినపుడు మరింత ఆశతో ఎదురు చూస్తారు. కేజీఎఫ్ చాప్టర్-3 విషయంలోనూ అలాంటి ఆశతోనే ఉన్నారు. 2022లో విడుదలై భారీ విజయాన్నందుకున్న కేజీఎఫ్-2 సినిమాలో హీరో కథ ముగించినట్లే ముగించి థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికి అడుగు పెట్టబోతున్న సమయంలో చాప్టర్-3కి లీడ్ ఇచ్చి కొత్త ఆశలు రేకెత్తించాడు ప్రశాంత్ నీల్.
ఐతే ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు గడిచిపోగా.. ఇప్పటిదాకా కేజీఎఫ్-3 దిశగా చిన్న అడుగు కూడా పడలేదు. ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసి డ్రాగన్ పనిలో నిమగ్నమయ్యాడు. దీని తర్వాత సలార్-2 చేయాల్సి ఉంది. మరోవైపు యశ్.. టాక్సిక్ సినిమా పూర్తి చేశాడు. తర్వాత రామాయణం రెండు భాగాల సంగతి చూడాల్సి ఉంది. దీంతో కేజీఎఫ్-3 నిజంగా ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా కేజీఎఫ్-3 గురించి యశ్ స్పందించాడు. ఇటు తాను.. అటు ప్రశాంత్ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నామని, అందుకే తమ కలయికలో తర్వాతి సినిమా ఎప్పుడనేది చెప్పలేమని అతనన్నాడు.
ఐతే తాను, ప్రశాంత్ అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నామన్న యశ్.. తమ ఇద్దరికీ కుదిరి.. తమకు నచ్చే కథ సిద్ధమైనపుడు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని యశ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా కేజీఎఫ్-3నేనా కాదా అన్నది అతను క్లారిటీ ఇవ్వలేదు. అన్ని కుదిరి కథ నచ్చితే సినిమా చేసే అవకాశమున్నట్లుగా మాట్లాడాడు.
మొత్తానికి యశ్ మాటల్ని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉండే అవకాశం కనిపించడం లేదు. వీళ్లిద్దరూ కలిసినా అది కేజీఎఫ్-3తోనే అని కూడా చెప్పలేం. కాబట్టి ఈ మెగా సీక్వెల్ మీద అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. 2018లో వచ్చిన కేజీఎఫ్ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. 2022లో రిలీజ్ అయిన దీని సీక్వెల్ రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
This post was last modified on April 22, 2026 8:40 am
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…