వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్లకు పైగా సినిమానే చేయని సంతోష్ శోభన్, తన తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ తొలి ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.
యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఆ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. రెండు కోట్ల మేర గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది శనివారం ఈ చిత్రం.
ఆదివారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని.. ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో మళ్లీ తామే ఇంకో లవ్ స్టోరీ చేయబోతున్నామని.. వచ్చే వాలంటైన్స్ డేకే అది కూడా రిలీజవుతుందని ధీరజ్ తెలిపాడు. మామూలుగా సంక్రాంతి విషయంలో ఇలాంటి క్రేజ్ ఉంటుంది, ఇలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ మాత్రం వేలంటైన్స్ డేకి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. అది కూడా లవ్ స్టోరీనే అని చెప్పాడు.
ఐతే దర్శకుడు కూడా అశ్వినేనా కాదా అన్నది మాత్రం ధీరజ్ వెల్లడించాడు. యువి అధినేతలతో కలిసి ఈ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐతే ఈలోపు సంతోష్ శోభన్, మానస వారణాసి కావాలంటే వేరే సినిమాలు చేసుకోవచ్చని.. కానీ వచ్చే ప్రేమికుల దినోత్సవానికి మాత్రం తమ కలయికలో సినిమా రిలీజవుతుందని చెప్పాడు.
This post was last modified on February 15, 2026 5:59 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…