గత వారం పది రోజులుగా తెరచాటునే ఉన్న `కోవా బన్` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదం సరికాదంటూ.. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ నాగబాబు, టీడీపీ తరఫున మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. నాగబాబు అయితే.. ఏకంగా బాధిత కుటుంబాన్ని తన నివాసానికి పిలిచి ఊరడించారు. రెక్కడితే కానీ.. డొక్కాడని కుటుంబాలను.. చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదని ఆయన హితవు పలికారు. బాధిత కుటుంబానికి తాము అండగా నిలుస్తామన్నారు. దీంతో సదరు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
అసలేంటిది?
కోవా-బన్.. ఓ చిరు తిండి. 10 రూపాయలకే చిన్న పాటి బన్‌లో మధ్యలో కోవాలాంటి స్వీట్ పదార్థాన్ని ఉంచి విక్రయిస్తారు. ఇది ఏపీలోని సీమ ప్రాంతం సహా.. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని కొన్ని కుటుంబాలకు చిరు వ్యాపారం. వీరు మొబైల్ వాహనాల్లో బన్నులు తీసుకువచ్చి.. అక్కడికక్కడే వాటిలో కోవాను పెట్టి విక్రయిస్తారు. ఇవి.. చాలా స్వీట్‌గా ఉండడంతోపాటు రుచికరంగా కూడా ఉంటాయి. దీంతో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక, ఈ చిరు వ్యాపారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ తిరునాళ్లు, జాతరలు జరిగినా.. అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసుకుంటారు.
ఇలానే గత నెలలో తెలంగాణలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు కర్నూలు జిల్లాకు చెందిన వలీ కుటుంబం వెళ్లి.. వ్యాపారం చేసుకుంది. అయితే.. కొందరు ప్రైవేటు ఛానెళ్ల విలేకరులు.. కోవా-బన్సుపై ఆరోపణలు చేయడంతోపాటు.. ఇది అనారోగ్యానికి దారి తీస్తుందని.. పేర్కొంటూ.. పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అంతేకాదు.. కోవాలో కోవాను చూపించాలని రచ్చ చేశారు. వారితోనే బన్నులు తినిపించి.. అవమానకంగా వ్యవహరించారని బాధితులు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు.. స్థానిక ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు.. బన్ను వ్యాపారి కుటుంబంపై దాడి చేసి కొట్టి.. 10 వేల రూపాయల విలువైన బన్నులను కాల్వలో పోశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై గత వారం పది రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. చిరు వ్యాపారిపై ఇంత ప్రతాపం ఎందుకని నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఈ వివాదానికి మతం రంగు కూడా పూసి అనైతిక ప్రచారాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి లోకేష్ బాధిత కుటుంబానికి ఫోన్ చేయగా.. నాగబాబు వలీని తన నివాసానికి పిలిచి ఓదార్చారు.
This post was last modified on February 15, 2026 8:06 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…