Movie News

పొంగల్ సినిమా… నిర్మాతకు తీవ్ర నష్టం

సంక్రాంతి తెలుగు వారికే కాదు.. త‌మిళుల‌కూ చాలా ప్ర‌త్యేకం. ఇక్క‌డ‌లాగే అక్క‌డా ఈ పండ‌క్కి భారీ చిత్రాలు రిలీజ‌వుతుంటాయి. ఐతే ఈ ఏడాది విజ‌య్ సినిమా జ‌న‌నాయ‌గ‌న్‌తో త‌మిళ బాక్సాఫీస్ వేడెక్కిపోతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం అనూహ్యంగా పోటీ నుంచి త‌ప్పుకుంది. దీంతో అంద‌రి చూపూ శివ‌కార్తికేయ‌న్ సినిమా ప‌రాశ‌క్తి మీదే నిలిచాయి.

ఇరుది సుట్రు (తెలుగులో గురు), సూరారై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) లాంటి క‌ల్ట్ మూవీస్ అందించిన సుధ కొంగ‌ర డైరెక్ట్ చేయ‌డం.. జ‌యం ర‌వి విల‌న్ పాత్ర చేయ‌డం.. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టించ‌డం, వింటేజ్ ట‌చ్ ఉన్న క‌థ కావ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. కానీ ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

ఐతే త‌మిళ క్రిటిక్స్ మాత్రం ఎప్ప‌ట్లాగే ఈ సినిమాను కూడా భుజానికెత్తుకుని మోశారు. 3 ప్ల‌స్ రేటింగ్స్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన మిగ‌తా సినిమాలన్నీ చిన్న‌వే కావ‌డంతో దీనికే ఎక్కువ థియేట‌ర్ల‌ను కొన‌సాగించారు.

హిందీ వ్య‌తిరేక ఉద్య‌మం.. త‌మిళుల ఆత్మాభిమానం, భాష‌, సంస్కృతి చుట్టూ తిరిగిన సినిమా కావ‌డంతో త‌మిళ జ‌నాలు ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవ‌డానికి అంగీక‌రించ‌లేదు. పీఆర్ టీమ్స్, త‌మిళ మీడియా వాళ్లు కూడా ఈ సినిమాకు హైప్ ఇస్తూనే సాగారు. క‌లెక్ష‌న్ల‌ను కూడా పెంచి చూపిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ అని ప్ర‌చారం చేశారు. చివ‌రికి చూస్తే.. ప‌రాశ‌క్తి పెద్ద డిజాస్ట‌ర్ అని తేలింది.

మూడో వారం నుంచి ఈ సినిమాకు వ‌సూళ్లే లేవు. చెప్పుకోద‌గ్గ షేర్ రాలేదు. జీవా సినిమా త‌లైవ‌ర్ తంబి త‌లైమ‌యిల్ దీనిపై స్ప‌ష్ట‌మైన ఆధిప‌త్యం చ‌లాయించింది. ప‌రాశ‌క్తి థియేట్రిక‌ల్ ర‌న్ అయిపోవ‌డంతో ఆ సినిమా లెక్క‌ల‌న్నీ బ‌య‌టికి వ‌చ్చాయి.

ఈ చిత్రం మీద రూ.150 కోట్ల బ‌డ్జెట్ పెట్టారు నిర్మాత‌లు. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమాకు వ‌చ్చిన గ్రాస్ క‌లెక్ష‌న్లు రూ.85 కోట్ల‌ని తేలింది. షేర్ చూస్తే రూ.50 కోట్ల లోపే. అంటే పెట్టుబ‌డిలో థియేట‌ర్ల నుంచి వ‌చ్చింది మూడో వంతు మాత్ర‌మే. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారా వ‌చ్చే ఆదాయం క‌లుపుకున్నా కూడా నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌ట్లేదు. కాబ‌ట్టి బాక్సాఫీస్ లెక్క‌ల్లో చెప్పాలంటే ఇది డిజాస్ట‌రే.

This post was last modified on February 2, 2026 10:27 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 hour ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

7 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

8 hours ago