Movie News

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న తొలి సినిమా రామ్ న‌గ‌ర్ బ‌న్నీ రిలీజ్‌కు ముందు ఎంత నెగెటివిటీ ఎదుర్కొన్నాడో తెలిసిందే. త‌న సినిమా ఈవెంట్లో అత‌డి హావ‌భావాల తాలూకు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయి.. దాని మీద విప‌రీతంగా ట్రోలింగ్ జరిగింది.

ఈ క్ర‌మంలో చంద్ర‌హాస్‌కు యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ కూడా వ‌చ్చింది. ఇక త‌న తొలి చిత్రం రామ్ న‌గ‌ర్ బ‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఏమాత్రం ప్ర‌భావం చూప‌కుండానే వెళ్లిపోయింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే చంద్ర‌హాస్‌కు పెద్ద బ్రేక్ ప‌డింది. అయినా అత‌డిలో ఏమీ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు.

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా అంటూ ఇప్పుడు అత‌ను కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూల్లోనే కాదు.. ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ చంద్ర‌హాస్ కాన్ఫిడెన్స్ ఏమీ త‌గ్గ‌లేదు.

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా ప్రి రిలీజ్ ఈవెంట్లో అయితే చంద్ర‌హాస్ మ‌రింత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. దాదాపు ప‌ది నిమిషాలు ఎంతో ఆత్మ‌విశ్వాసంతో స్పీచ్ ఇచ్చాడు. టీంలో అంద‌రి గురించి.. అలాగే అతిథులుగా వ‌చ్చిన ఆది సాయికుమార్, జ‌యంత్ సి.ప‌రాన్జీల గురించి బాగా మాట్లాడాడు. ఆది లాగే తానూ క‌ష్ట‌ప‌డ‌తాన‌ని, స‌క్సెస్ వ‌చ్చే వ‌ర‌కు ఆగ‌న‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

ఫిబ్ర‌వ‌రి 6న బ‌రాబ‌ర్ ప్రేమిస్తా రిలీజ‌వుతుంద‌ని.. తాను ప్రేక్ష‌కుల‌ను బ‌రాబ‌ర్ ప్రేమిస్తాన‌ని.. అలాగే వాళ్లు కూడా త‌న‌ను ప్రేమిస్తార‌ని అత‌న‌న్నాడు. బ‌రాబ‌ర్ ప్రేమిస్తా సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌ద‌ని.. ఇందులో సూప‌ర్ ట్విస్టులుంటాయ‌ని.. ఎమోష‌న్ కూడా బాగుంటుంద‌ని చెప్పాడు చంద్ర‌హాస్.

మ‌రోవైపు చంద్ర‌హాస్ తండ్రి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. చంద్ర‌హాస్‌ను కొంద‌రు ఇష్ట‌ప‌డ‌వ‌చ్చు, కొంద‌రు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని.. కానీ అత‌ను సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత ప‌డుతున్నాడ‌ని చెప్పాడు. మిడ్ స‌మ్మ‌ర్లో ఈ సినిమా కోసం క‌రీంన‌గ‌ర్లో ఓపెన్ ప్లేస్‌లో షూటింగ్ చేశాడంటూ త‌న కొడుకు క‌మిట్మెంట్ గురించి వివ‌రించాడు ప్ర‌భాక‌ర్.

ఫిబ్రవరి 6వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాకి మంచి టాక్ వస్తె యాటిట్యూడ్ స్టార్ కోసం జనం థియేటర్లకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పెద్ద రిలీజులు లేని సమయంలో వస్తున్న బరాబర్ ప్రేమిస్తా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

This post was last modified on February 1, 2026 11:07 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago