ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల విషయంలో నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఫలితాలు ఇచ్చేలాగే ఉంది. ఈ సినిమా కథకు కేంద్ర బిందువైన టైం మెషీన్ ని ప్రత్యేకంగా తయారు చేయించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఉంచడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. టీవీ, యూట్యూబ్, ఓటిటిలో ఉచితంగా చూసే వెసులుబాటు ఉన్న ఒక పాత సినిమాకు ఇంత పబ్లిసిటీ చేయడం చిన్న విషయం కాదు. 4కె రెజల్యూషన్ కావడంతో ఫ్యాన్స్ బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు.
ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే దానికి స్వయంగా హీరో బాలకృష్ణ హాజరయ్యారు. గతంలో సింహాద్రికి ఇలాంటి వేడుక చేశారు కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. విశ్వక్ సేన్ ని గెస్టుగా తీసుకొచ్చి కానిచ్చారు. కానీ ఆదిత్య 369 ఈ విషయంలోనూ ప్రత్యేకత సంతరించుకుంది. పోస్టర్లు, ట్రైలర్, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విశేషాలు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఆసక్తి పెరిగేలా చేశాయి. ఇప్పుడు టీనేజ్ లో ఉన్న కుర్రాళ్ళు, మూడు పదుల వయసులో ఉన్న యువకులు ఈ మూవీని థియేటర్లలో చూసి ఉండరు. అనుభూతి చెందడానికి ఇదో మంచి అవకాశం.
ఇండియాలోనో మొదటి సైన్స్ ఫిక్షన్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య 369లో బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఇళయరాజా అద్భుతమైన పాటలు బీజీఎమ్, అమ్రిష్ పూరి విలనీ, తెలుగు తెరకు అప్పటిదాకా పరిచయం లేని కాలయంత్రమనే కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్ బెస్ట్ చిత్రాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఇస్తారు. ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తామని, త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చిన బాలకృష్ణ ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on April 4, 2025 10:35 am
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…