ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని దక్కించుకున్నారంటే ఆకాశమే హద్దుగా అది పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు కె విశ్వనాథ్ – కమల్ హాసన్, కోదండరామిరెడ్డి – చిరంజీవి, కోడి రామకృష్ణ – బాలకృష్ణ లాంటి జంట ద్వయాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అలాంటి అదృష్టానికి నోచుకున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తనకో అపురూప కానుక అందింది. పవిత్రమైన దేవుడి పాదుకలు కూడిన హనుమాన్ చాలీసా బాక్సులో పొందుపరిచి చరణ్, ఉపాసన తనకు పంపించారు.
అందులో ఒక లేఖ ఉంది. నా జీవితంలో క్లిష్టమైన సందర్భాల్లో హనుమంతుడు తనకు తోడుగా ఉన్నాడని, నలభై పడిలో అడుగు పెడుతున్న తనకు ఈ సందర్భంగా నీతో ఆ బలాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది పంపుతున్నానని రామ్ చరణ్ సంతకం చేయడం విశేషం. ఉపాసన, చరణ్ సంయుక్తంగా రాసిన మరో లెటర్ లో కూడా వాళ్ళెంత బుచ్చిబాబుని అభిమానిస్తున్నారో అందులో వ్యక్త పరిచారు. ఇంత బహిరంగంగా కేవలం ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడిని చరణ్ నమ్మడం ఇదే మొదటిసారని చెప్పాలి. అసలు పెద్ది ఇంకా రిలీజ్ కాకుండానే ఈ స్థాయిలో బాండింగ్ ఏర్పడటం ఘనతే.
ఇప్పుడు అందరి కళ్ళు ఏప్రిల్ 8 శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ కాబోయే పెద్ది టీజర్ మీద ఉన్నాయి. నిర్మాత రవిశంకర్ ఇప్పటికే దీని గురించి ఓ రేంజ్ లో ఊరించారు. ఒక్క షాట్ ని వెయ్యి సార్లు చూస్తారనే మాట అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ అంతకు మించే ఉంది. గేమ్ ఛేంజర్ గాయాన్ని పూర్తిగా మాన్పే గొప్ప సినిమా ఇస్తాడని ఎదురు చూస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ క్యామియో చాలా ప్రత్యేకంగా ఉంటుందట.
This post was last modified on April 4, 2025 10:41 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…