టీజీ 09 9999 నంబరు కోసం 25.50 లక్షలు

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న రవాణశాఖ అధికారి కార్యాలయం జాక్ పాట్ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక ఫ్యాన్సీ నంబరుకు రూ.25.50 లక్ష్లల రూపాయలు పలికింది. తమ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్ ఎక్స్ వాహనం కోసం టీజీ 09 9999 నంబరు కోసం వేలం పాటలో భారీ ధరను పాడి కొనుగోలు చేసింది సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్.

ఫ్యాన్సీ నంబర్లకు ఫ్యాన్స్ పెరిగిపోయిన నేపథ్యంలో రవాణాశాఖకు కాసుల వర్షం కురుస్తుంది. ఫ్యాన్సీ నంబ‌ర్ల‌తో ఒక్క రోజే ఖైరతాబాద్ ఆర్టీఎ కార్యాలయాయానికి రూ. 53.34 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబ‌ర్‌కు రూ. 21.60 ల‌క్ష‌లు పలుక‌గా, అతి త‌క్కువ‌గా టీఎస్ 09 జీడీ 0027 నంబ‌ర్‌కు రూ. 1.04 ల‌క్షలు ప‌లికింది.

ఫ్యాన్సీ నంబ‌ర్ల‌ను కొనుగోలు చేసింది ఈ సంస్థ‌లే..

టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 ల‌క్ష‌లు(ప్రైమ్ సోర్స్ గ్లోబ‌ల్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 ల‌క్ష‌లు(మెఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్స్‌)
టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 ల‌క్ష‌లు(ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్)
టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 ల‌క్ష‌లు(గోయ‌జ్ జ్యువెల‌రీ)
టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు(సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌)
టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు(సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్‌)
టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు(ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజ‌రీ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు(శ్రీనివాస్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్)