ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే .. ఆరోగ్యంగా ఉంటారా? నాశనమై పోతారా? అంటే.. దీనిలో తడుముకోవా ల్సిన ఏమీ లేదు. ఎంతటివారైనా నాశనం అయిపోతారు. కానీ, సరదాకు చెప్పారో.. నిజ్జంగా నిజమేనో తెలియదు కానీ… తన ఆరోగ్య రహస్యం డ్రగ్సేనని టెస్లా అధినేత, ట్విట్టర్(ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ మాత్రం తన ఆరోగ్య రహస్యం డ్రగ్సేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తను వాడే డ్రగ్స్ పేరును కూడా ఆయన చెప్పారు. అదే `కెటామైన్`.
అక్కడితో కూడా మస్క్ ఆగిపోలేదు.. తన దిగ్గజ కంపెనీ టెస్లా ను విజయవంతంగా నిర్వహించడంలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడుతోందని బాంబు పేల్చారు. ఇటీవల ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. “డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నా. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి డ్రగ్‌ని ఉపయోగిస్తున్నా“ అని మస్క్ చాలా కాన్పిడెంట్‌గా చెప్పడం గమనార్హం.
మెడికేషన్‌లో భాగంగా కెటామైన్ వాడుతున్నానని, ఒక వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకుంటానని మస్క్ వివరించారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఉందని వివరించారు. కెటామైన్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే పనిని పూర్తి చేయలేరని, తనకు చాలా పని ఉంటుందని మస్క్ అన్నారు. రోజులో 16 గంటలపాటు పని చేస్తుంటానని అన్నారు. అయితే.. ఇది తనకు మాత్రమే పరిమితమని.. ఇది తాను ఎవరికీ దిశానిర్దేశం చేసేందుకు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికా సహా భారత్ వంటి అనేక దేశాల్లో డ్రగ్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ.. దొడ్డిదారిలో ఇవి రవాణా అవుతున్నాయి. వినియోగం కూడా పెరుగుతోంది. దీనిపైనే ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రం ఏంటంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డ్రగ్స్ నిసేధం ఎన్నికల హామీ గా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates