Trends

కంపెనీ బాత్‌రూంలో శిశువును ప్ర‌స‌వించి… పరార్

వివాహం ముందు, తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునే విధానం ఈ మధ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లోని క్వాంటమ్ కంపెనీలోని బాత్ రూంలో శిశువు క‌నిపించడం.. కలకలం సృష్టించింది. క్వాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువ‌తికి ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ యువ‌తి.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన మీద సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంట‌నే.. రంగంలోకి దిగిన పోలీసులు.. స‌ద‌రు యువ‌తి కోసం.. గాలించారు. అయితే… అప్ప‌టికే ఆమె కంపెనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో శిశువును చైల్డ్ వెల్ఫేర్ సంస్థ‌కు అప్ప‌గించి.. కేసు ను ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రోవైపు.. ఇటీవల త‌మిళ‌నాడులో కూడా.. ఇలాంటి ఘ‌ట‌నే ఒకటి తెర‌మీదికి వ‌చ్చింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువ‌తి ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. కానీ అందులో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురి చేసింది.

ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ మృతదేహం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేయడానికి సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి అరెస్టు చేశారు. ఆమె తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని(23). పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందని భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు ఫ్లష్ ట్యాంకులో ఆ పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత పెట్టి మూసేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.

This post was last modified on October 26, 2022 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…

34 minutes ago

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…

47 minutes ago

ఒక్క మాటతో 400 సినిమాల్లో అవకాశాలు

ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…

3 hours ago

నిత్య ఆరోగ్యానికి సంజీవని… సోంపు

సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…

7 hours ago

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…

7 hours ago

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…

9 hours ago