మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో రానున్న సంక్రాంతి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతి పోటీ లో నిలిచిన ఈ సినిమాకు ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. చిరు -రవితేజ మీద కూడా చాలా సీన్స్ పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయట. ఒక యూనిట్ ను ‘పంతం’ దర్శకుడు చక్రవర్తి హ్యాండిల్ చేస్తున్నాడని సమాచారం. మరో యూనిట్ తో బాబీ కొన్ని సీన్స్ తీస్తున్నాడని తెలుస్తుంది.
వాల్తేరు వీరయ్య ని సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా జనవరిలో రావడం కష్టమే అని మొన్నటి వరకూ మేకర్స్ కి డౌట్ ఉండింది. కానీ ఎప్పుడైతే బాలయ్య సినిమా కూడా సంక్రాంతి కి ఫిక్స్ అయ్యిందో అప్పటి నుండి పోటీ మొదలైంది. ఇక వీరయ్య వెనక్కి తగ్గితే ఫ్యాన్స్ ఒప్పుకోరు కనుక లాక్ చేసుకున్న సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారు. పైగా ఇటు బాలయ్య అటు చిరు రెండు సినిమాలకు మైత్రి నే నిర్మాణం కావడంతో ఈసారి ఒకే బేనర్ నుండి వస్తున్న రెండు బడా సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంకా రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. రెండూ మాస్ కమర్షియల్ సినిమాలే కావడంతో ఈసారి చిరు , బాలయ్య మధ్య టఫ్ వార్ జరగనుంది. మరి సంక్రాంతి పోటీలో వీరుడుగా నిలిచే ‘వీర’ ఎవరో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 26, 2022 3:13 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…