Movie News

‘ప్యారడైజ్’లో బూతులకు భయపడి…

ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన దగ్గర్నుంచి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇందులో నాని పాత్ర, తన లుక్, అతను మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రేక్షకులు ఊహించని విధంగానే ఉంటున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో.. ‘ఇది ఒక లం..కొడుకు కథ’ అనే డైలాగ్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.

దాన్ని బట్టే సినిమాలో మరిన్ని బూతులుంటాయని.. తెలుగులో మునుపెన్నడూ చూడనంత రా అండ్ రస్టిక్‌గా ఈ సినిమా తీశారని అర్థమైపోయింది. ఈ సినిమాలో బూతులకు భయపడి ఒక యువ నటి ఆ సినిమాకు దూరమైపోయిందట కూడా. ఆ నటే.. మౌనిక రెడ్డి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

తన సినిమా ఆడిషన్ అనుభవాల గురించి చెప్పమని ఆ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘ది ప్యారడైజ్’ గురించి చెప్పుకొచ్చింది మౌనిక. ఆ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినపుడు సీన్ పేపర్ చూడగానే అందులో బూతులు కనిపించేసరికి షాకైపోయానని మౌనిక తెలిపింది. ఆ డైలాగులు పలుకుదామని ప్రయత్నించానని.. కానీ తన వల్ల కాలేదని ఆమె చెప్పింది. తనకు తెలిసినవి రెండే రెండు బూతులని.. కానీ ఆ పేపర్లో పెద్ద సంఖ్యలో ఘాటు బూతులు ఉన్నాయని.. వాటిని తాను పలకరలేకపోయానని ఆమె చెప్పింది.

కొంత ప్రయత్నించాక ఇక తన వల్ల కాదని.. ఇది మన తరహా కాదు అనుకుని ఆడిషన్స్ నుంచి వచ్చేసినట్లు మౌనిక వెల్లడించింది. ఆమె మాటల్ని బట్టి చూస్తే ‘ది ప్యారడైజ్’లో ఒక రేంజిలో బూతులు ఉంటాయని అర్థమవుతోంది. సినిమాలో వయొలెన్స్ కూడా మామూలుగా ఉండదని ప్రోమోలను బట్టి తెలుస్తోంది.

కాబట్టి ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ రావడం లాంఛనమే. యూత్ ఎగబడి చూసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో సినిమాకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 13, 2026 10:48 am

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

2 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

2 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

4 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

5 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

6 hours ago