టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు. వారికి అవకాశాలివ్వడంలోనూ నిర్మాతలు వెనకడుగు వేయట్లేదు. కానీ ఒక హీరో మాత్రం వరుసగా రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు ఇచ్చి అంతర్ధానం అయిపోవడం.. రెండేళ్లకు పైగా ఇండస్ట్రీలో తన ఊసే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ హీరోనే.. కార్తికేయ గుమ్మకుండ.
‘ప్రేమతో మీ కార్తీక్’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు వరుస కట్టాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహాలో ముందు వెనుక చూడకుండా వరుసగా సినిమాలు ఒప్పేసుకున్నాడు. దాని వల్ల ఎదురు దెబ్బలు తిన్నాడు. ఐతే కొంచెం లేటుగా జ్ఞానోదయం మంచి సినిమాలు లైన్లో పెట్టాడు. 2023లో అతడి నుంచి వచ్చిన ‘బెదురు లంక 2012’ మంచి ఫలితాన్నందుకుంది. ఆ తర్వాతి ఏడాది యువి క్రియేషన్స్ వారి ‘భజే వాయు వేగం’తో ఇంకో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు పడ్డాయంటే ఆ హీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడతారు. ఆ హీరో కూడా చకచకా సినిమాలు చేయాలని చూస్తాడు. కానీ కార్తికేయ మాత్రం ‘భజే వాయు వేగం’ రిలీజైన రెండేళ్ల తర్వాత కూడా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. అసలు తన గురించి ఇండస్ట్రీలో డిస్కషనే లేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కార్తికేయ పేరు వినిపించడం లేదు.
ఏదైనా కొత్త కథ తయారీలో నిమగ్నమై ఉన్నాడా.. తనకు నచ్చే కథేదీ రావట్లేదా.. లేక సినిమాల మీద ఆసక్తి పోయిందా అన్నది తెలియడం లేదు. కార్తికేయ కుటుంబానికి నాగార్జున పేరుతో హైదరాబాద్‌లో కొన్ని స్కూల్స్ సహా వేరే వ్యాపారాలున్నాయి. మరి వాటిలో ఏమైనా అతను బిజీ అయిపోయాడేమో తెలియదు. ఇండస్ట్రీలో కొనసాగే ఉద్దేశం ఉంటే.. ఇలా మరీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకులు తనను మరిచిపోతారని గుర్తించి కార్తికేయ త్వరగా రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తే బెటరేమో.
This post was last modified on August 13, 2026 9:18 am
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…