తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోన్నియన్ సెల్వన్ అనే సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కార్తి ఈ దీపావళికి ‘సర్దార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ తో ఇంప్రెస్ చేసి కార్తి మంచి వసూళ్ళు రాబడుతున్నాడు. డ్యుయల్ రోల్ లో కనిపించి మెప్పించాడు. అయితే దీపావళి సినిమాల్లో సర్దార్ కే ఇక్కడ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మిగతా సినిమాలన్నీ అంతంత మాత్రంగానే కలెక్షన్స్ అందుకుంటున్నాయి.
రెస్పాన్స్ బాగుంది కాబట్టి అందుకే వెంటనే సీక్వెల్ ఎనౌన్స్ చేసేశారు మేకర్స్. సర్దార్ 2 కి లీడ్ గా వచ్చే ఓ సన్నివేశాన్ని రిలీజ్ చేసి మరో మిషన్ తో పార్ట్ 2 తెరకెక్కనుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో సర్దార్ 2 సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక కార్తి చేతిలో సర్దార్ 2 తో పాటు ఖైదీ 2 కూడా ఉంది. లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఖైధీ తెలుగులో బాగా ఆడింది. ముఖ్యంగా ఓటీటీ లో ఈ సినిమాను బాగా చూశారు. అందుకే ఖైదీ సీక్వెల్ కూడా అప్పుడే ఎనౌన్స్ చేశారు.
కాకపోతే విక్రమ్ సీక్వెల్ తోనే ఖైదీ మిక్స్ అయి ఉంటుందనే టాక్ ఉంది. కానీ దర్శకుడు ఈ రెండు సీక్వెల్స్ ను విడివిడిగానే తీసే ఆలోచనలో ఉన్నాడు. అంటే కార్తి లిస్టులో ఇప్పుడు రెండు సీక్వెల్స్ ఉన్నాయన్నమాట. మరి ఖైదీ 2 , సర్దార్ 2 ఈ రెండిటిలో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. ఇక తెలుగులోనూ మరో మంచి అవకాశం కోసం చూస్తున్నాడు కార్తి. ఇక్కడి దర్శకులతో కూడా టచ్ లో ఉంటున్నాడు.
This post was last modified on October 26, 2022 3:20 pm
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు,…
బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం…