Political News

యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు ఒక హెడ్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని కొట్టడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు వాడి యాక్షన్ కు తగినట్లుగానే రియాక్షన్ చూపించారు. అయినప్పటికీ పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఒక యువకుడు జనం రద్దీగా వున్న రోడ్డులో తిరుపతి ఒన్ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య చొక్కా పట్టుకొని దాడి చేయడం కనిపించింది. చుట్టూ వున్న జనాలు నువ్వు తప్పు చేస్తున్నావ్.. కానిస్టేబుల్ ను విడిచిపెట్టమంటూ బతిమాలడం వినిపిస్తుంది.

అయినప్పటికీ అతను హెడ్ కానిస్టేబుల్ రమణయ్యను విడిచి పెట్టలేదు. పైగా కత్తి తీసుకొని పొడిచేందుకు వెంట పడ్డాడు. వారిని ధైర్యంగా ఎదుర్కొన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు.

రమణయ్య సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన యువకుడికి తాట తీశారు. చేతికి సంకెళ్లు వేసి వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు పిలుచుకొని వెళ్లారు. పోలీసు మీద దాడికి పాల్పడిన ఇటువంటి మూకలకు బయటకు రాకుండా జైలులో పడేయాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు.

This post was last modified on August 13, 2026 12:29 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago