మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే. రెండో పెళ్లి చేసుకోకపోతే జీవిత ఖైదు శిక్ష వేస్తారా ? రెండు పెళ్లిళ్లు చేసుకోవటం చట్టప్రకారం తప్పు కదా ? అని అనుకుంటున్నారు. మనదేశంలో అయితే తప్పు కావచ్చు కానీ ఆ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే తప్పు. ఓహ్ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ? తూర్పు ఆఫ్రికా లోని ఎరిత్రియా దేశంలో. మనదేశంలో రెండో పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం తప్పే. అంటే మొదటి భార్యతో కలిసుంటూనే రెండోపెళ్లి చేసుకోవటం తప్పు.
అయితే వివాహం చేసుకోకుండానే మరో స్త్రీతో కలిసుండటం, మొదటి భార్యకు తెలీకుండానే రెండో వివాహం చేసుకోవటం మనదేశంలో ఈ మధ్యలో బాగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో మహిళల్లో కొందరు కొంతమంది పురుషుల్లాగా తయారైపోతున్నారులేండి. ఇక ఎరిత్రియా గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్రతి మగాడు కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. లేదు లేదు తనకిష్టం లేదు చేసుకోనంటే కుదరదు. రెండు పెళ్లిళ్లు చేసుకోని మగాడు నేరస్ధుడిగానే లెక్క.
విచిత్రం ఏమిటంటే ఎరిత్రియాలో రెండు వివాహాలు చేసుకోవాల్సిందే అని ప్రత్యేకమైన చట్టమే ఉంది. భర్త రెండో వివాహం చేసుకోవటానికి మొదటిభార్య కూడా అనుమతించాల్సిందే తప్ప వేరే దారి లేదు. వివాహం తర్వాత ఇద్దరు భార్యలను భర్త సక్రమంగా చూసుకోవాల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో రెండు వివాహాల చట్టం అమలవుతునే ఉంది. ఇంతకీ ఆ దేశంలో రెండు వివాహాలచట్టం ఎందుకు వచ్చిందంటే అక్కడ పురుషుల జనాభా కన్నా మహిళల జనాభా చాలా ఎక్కువట.
ప్రతి మగాడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలంటే చాలామంది స్త్రీలకు అసలు వివాహయోగమే దక్కటం లేదట. దీంతో మహిళల సంక్షేమాన్ని, చట్టబద్దమైన సంతానాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇలాంటి చట్టం చేసిందట. చైనా, మనదగ్గర ఇలాంటి సమస్య ఇప్పటికైతే లేనందుకు సంతోషించాల్సిందే. కొంతకాలం అయితే ఎరిత్రియా ప్రభుత్వం చేసిన చట్టాలే చాలా దేశాల్లో వస్తాయేమో చూడాలి.