జేఈఈ మొయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఈ ఫలితాలలో.. ఫలితాలలో దాదాపు 44 మంది అభ్యర్థులు 100శాతం సాధించడం గమనార్హం. కాగా.. వారిలో 18మందికి ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం.
కాగా.. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష రాశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కుంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గుజరాతి, అస్సామీస్, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.