ఆనందయ్య.. ఈ పేరు తెలంగాణ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక ఆయన పంపిణీ చేస్తున్న కరోనా మందు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కరోనాను నయం చేసే మందు అంటూ అమాంతం వెలుగులోకి వచ్చిన ఆనందయ్య మందుకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయట. దీంతో.. ఆయన ఇక నుంచి ఉచితంగా కరోనా మందు పంపిణీ చేయలేనంటూ తేల్చి చెప్పేశాడు.
మందును పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు సహకరించట్లేదని, తనను నిర్భంధించేందు ప్రయత్నించిందని, ఆ తర్వాత కోర్టు అనుమతి తెచ్చుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని తెలిపారు.
అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచితంగా మందు ఇస్తున్నందున ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని, అందువల్ల ఇకపై కరోనా మందు ఉచితంగా ఉండే అవకాశం లేకపోవచ్చని, ప్రభుత్వ సహకారం ఉంటే ఇలా జరగదని, సాయం అందకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆనందయ్య చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates