Trends

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా భారీ సుంకాలను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఆగస్టు 1 నుండి రెండేళ్ల పాటు జీరో శాతం టారిఫ్ ఉంటుందని, 2028 ఆగస్టు నుండి ఏకంగా 100 శాతం, 2029 నుండి 200 శాతం సుంకం అమలు చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులను తయారు చేయాలనేదే తన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వల్ల భారతదేశానికి భారీగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచానికే ‘ఫార్మసీ’గా పేరుగాంచిన భారత్, ప్రతి ఏటా అమెరికాకు దాదాపు 9 నుండి 10 బిలియన్ డాలర్ల విలువైన జెనరిక్ మందులను ఎగుమతి చేస్తోంది. అమెరికాలో వాడే మొత్తం జెనరిక్ మందుల్లో దాదాపు 40 శాతం వాటా ఇండియాదే. బిపి, షుగర్, క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన భారతీయ మందులను అక్కడి ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు.

పేటెంట్ మందుల కంపెనీలతో పోలిస్తే జెనరిక్ ఔషధాలు తయారుచేసే సంస్థలకు లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందల శాతాల్లో పన్నులు పడితే, ఆ భారాన్ని తట్టుకుని తక్కువ ధరలకే మందులు అమ్మడం కంపెనీలకు చాలా కష్టం. రాత్రికి రాత్రే అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రొడక్షన్ మొదలుపెట్టడం కూడా ఏ మందుల కంపెనీకి సాధ్యమయ్యే పని కాదు. సండోజ్, తేవా, వయాట్రిస్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఈ నిబంధనల వల్ల ఇబ్బందుల్లో పడనున్నాయి.

ప్రస్తుతానికి భారతీయ కంపెనీలకు ఈ సుంకాల నుండి ఏమైనా మినహాయింపు దక్కుతుందా లేదా అనేది ఇంకా క్లియర్‌గా తెలియలేదు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే వాణిజ్య పరమైన చర్చలు జరుగుతున్నందున, భారత ప్రభుత్వం ఫార్మా ఎగుమతులపై ప్రత్యేక సడలింపుల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాల విషయంలో పాత నిబంధనలే కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తున్నా, దీనివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

This post was last modified on July 22, 2026 11:10 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

24 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

30 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

44 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago