Trends

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి మైదానం కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా, స్పిన్‌కు బాగా సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా పరుగుల కోసం ఇబ్బంది పడ్డారు. చివరకు భారత్ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు ఓవర్లలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ తొలి బంతికే ఔటయ్యాడు. సంజూ శాంసన్ 9, ఇషాన్ కిషన్ 3 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 బంతుల్లో 16 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 32 వరకు చేరింది. జపాన్ బౌలర్ చార్లీ హారా, హిన్జే రెండు వికెట్లు తీసుకున్నాడు.

33 పరుగుల లక్ష్యంతో దిగిన జపాన్ కూడా మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ 12 పరుగులు చేయగా, బెంజమిన్ ఇటో డేవిస్ 9 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. వికెట్లు పడుతున్నా జపాన్ మాత్రం మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లింది.

భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ రెండు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి జపాన్ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగే వచ్చింది. దీంతో జపాన్ 30 పరుగుల దగ్గర ఆగిపోయింది.

బలమైన భారత జట్టును జపాన్ 32 పరుగులకే పరిమితం చేయడం ఒక ఎత్తయితే, లక్ష్య ఛేదనలో 30 వరకు రావడం మరో ఎత్తు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడినా, జపాన్ మాత్రం టీమిండియాను చివరి బంతి వరకు టెన్షన్‌లో ఉంచింది.

This post was last modified on September 22, 2026 2:35 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

3 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

4 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

9 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

10 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

10 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

13 hours ago