Movie News

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ఏఐజిలో చేరిన తర్వాత ఇవాళ చిన్న శస్త్ర చికిత్స నిర్వహించబోతున్నట్టు సమాచారం. అది అయ్యాక కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ఇవాళో రేపో విడుదల చేసే అవకాశం ఉంది. అది వచ్చాక ఫ్యాన్స్  రిలాక్స్ అవ్వొచ్చు.

ఆరోగ్యం ప్రధానం కాబట్టి బాలకృష్ణ రెస్టు తీసుకోవడం చాలా అవసరం. ఇదిలా ఉండగా డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న ఎన్బికె 111 ఇప్పుడు తన ప్రణాళికను మార్చుకోక తప్పేలా లేదు. ఎందుకంటే నాలుగు వారాలు షూటింగ్ కి దూరమంటే ఆగస్ట్ చివరికి కానీ బాలయ్య బయటికి రాలేరు. ఈలోగా ఆర్టిస్టుల కాల్ షీట్లు మారిపోతాయి. షెడ్యూల్స్ ని మళ్ళీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంబినేషన్ ఉన్న ఎపిసోడ్లకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది.

అదే జరిగితే 2027 సంక్రాంతి లేదా అంతకన్నా ఆలస్యంగా ఎన్బికె 111 వస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ అంచనాల దశనే కాబట్టి బాలయ్య ఇంకా త్వరగా కోలుకుంటే ప్లానింగ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు తమన్ సంగీతం సమకూరుస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ లెక్కన కొరటాల శివ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. గత కొన్నేళ్లలో బాలయ్య షూటింగ్ లో గాయపడిన సందర్భాలు లేవు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నారు. అయితే నిన్న అనుకోకుండా జరిగిన ఘటన వల్ల పట్టుతప్పి కింద పడ్డారు. ఆందోళన చెందాల్సింది లేకపోయినా ఈ వయసులో బాలయ్య లాంటి సీనియర్ హీరోలు విపరీతమైన జాగురుకతతో ఉండాలి. తారక్, పవన్ కళ్యాణ్ సహా ఎందరో ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. 

This post was last modified on July 22, 2026 10:57 am

Share

Recent Posts

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 minutes ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

10 hours ago