ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో సిడ్నీలో మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన కేసులో వార్నర్ తన తప్పును అంగీకరించాడు. ఈ విషయాన్ని అతడి లాయర్ బాబీ హిల్ స్వయంగా కోర్టుకు తెలియజేశారు. ఏప్రిల్ 5వ తేదీన సిడ్నీలోని ఈస్టర్న్ సబర్బ్స్ ప్రాంతంలో పోలీసులు రొటీన్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో వార్నర్ కారును ఆపి బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పరీక్షించగా, రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. చట్టం ప్రకారం అనుమతించిన లిమిట్ కంటే ఇది రెట్టింపు. ఈ కేసు విచారణలో వార్నర్ తరపు న్యాయవాది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పండుగ రోజున వైన్ తాగడం నేరం కాదని, కానీ క్యాబ్ బుక్ చేసుకోకుండా సొంతంగా కారు నడపాలని వార్నర్ తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా తెలివితక్కువ పనే అని కోర్టులో చెప్పారు. జరిగిన పొరపాటును వార్నర్ పూర్తిగా అంగీకరిస్తున్నాడని స్పష్టం చేశారు. ఈ కేసులో తుది తీర్పు ఆగస్టు 18న రానుంది.
తాగి వాహనం నడిపిన నేరానికి వార్నర్ కు కనీసం ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. దీనికి తోడు 2200 ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ జరిమానాతో పాటు గరిష్టంగా తొమ్మిది నెలల జైలు శిక్ష పడే ప్రమాదం కూడా లేకపోలేదు. తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వార్నర్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2018లో సౌతాఫ్రికా టూర్ లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తేలడంతో ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఆ ఘటనతో కెప్టెన్సీ చేపట్టకుండా జీవితకాల నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. అంతకుముందు 2013లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ పై చేయి చేసుకున్నందుకు కూడా సస్పెన్షన్ కు గురయ్యాడు.
This post was last modified on July 22, 2026 11:59 am
బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…
రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…
2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…
వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…
ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగులకు సేవలు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్…