Trends

చాట్ GPT‌ సపోర్ట్… తప్పిపోయిన వృద్ధుడిని ఇంటికి చేర్చాడు!

ఒక వృద్ధుడు.. పంజాబ్ అని తెలుసు కానీ పూర్తి అడ్రస్ చెప్పలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తులేవు. ఆయన చెప్పగలిగింది ఫతేగఢ్ గుజ్రాన్ అనే ఊరి పేరు మాత్రమే. గయాజీకి చెందిన నీరజ్‌కు దొరికిన ఈ ఒక్క క్లూతో చాట్ GPT‌లో వెతకడం మొదలుపెట్టారు. చివరకు ఆ ఊరు లూథియానా జిల్లాలో ఉందని గుర్తించారు.

చమన్ లాల్ అనే ఈ వృద్ధుడు గయాజీ రైల్వే స్టేషన్ సమీపంలో ఆకలితో కనిపించారు. నీరజ్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి నాలుగు రోజుల పాటు తన దగ్గరే ఉంచుకున్నారు. చమన్ లాల్‌కు పంజాబీ మాత్రమే రావడంతో వివరాలు తెలుసుకోవడం కూడా అంత సులభం కాలేదు. ఆయన చెప్పిన ఊరి పేరును రకరకాలుగా మార్చి ChatGPTతో పాటు ఇంటర్నెట్‌లో దాదాపు మూడు రోజుల పాటు సెర్చ్ చేశారు. ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామం మచ్చివారా సాహిబ్ సమీపంలో ఉందని చివరకు తెలిసింది.

చమన్ లాల్ అసలు సెప్టెంబర్ 11న గోల్డెన్ టెంపుల్ దర్శనం కోసం అమృత్‌సర్ వెళ్లారు. పంజాబ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకంలో వెళ్లిన గ్రూప్ నుంచి అక్కడ విడిపోయారు. కుటుంబ సభ్యుల వివరణ ప్రకారం ఆయనకు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని పొరపాటున బిహార్ వెళ్లే రైలు ఎక్కారు. అలా గయాజీ వరకు వెళ్లిపోయారు.

ChatGPTతో గ్రామం ఎక్కడుందో తెలుసుకున్న నీరజ్ చమన్ లాల్‌ను ఒంటరిగా పంపలేదు. ఆయనతో కలిసి బిహార్ నుంచి పంజాబ్‌కు వచ్చారు. మచ్చివారా ప్రాంతానికి చేరుకున్న తర్వాత వృద్ధుడి ఫొటోను స్థానికులకు చూపిస్తూ ఫతేగఢ్ గుజ్రాన్ గురించి అడిగారు. మాస్టర్ కృష్ణ లాల్ అనే వ్యక్తి చమన్ లాల్‌ను గుర్తించారు. వృద్ధుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు అప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోను ఆయన గతంలో చూశారు. వెంటనే కుటుంబానికి సమాచారం ఇచ్చారు. చమన్ లాల్ మనవడు సుఖ్‌చైన్ సింగ్ అక్కడికి వచ్చి తన తాతను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు.

This post was last modified on September 21, 2026 1:25 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

2 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

2 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

6 hours ago