Trends

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ జిల్లాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులతో అలరారుతున్నాయి. తాజాగా బంగారు గనులతో రాయలసీమ రతనాల సీమగా మారిపోతోంది. ఇప్పటికే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్రారంభం కాగా…త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలోనూ గోల్డ్ మైన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలన పూర్తి కాగా… త్వరలోనే బంగారు వెలికితీతకు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో 2002 దాకా బంగారం వెలికితీత పనులు కొనసాగాయి. బంగారం వెలికితీతకు సంబంధించి అప్పటిదాకా జారీ అయిన టెండర్ల గడువు ముగియడంతో రామగిరి గోల్డ్ ఫీల్డ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే తాజాగా ఏపీలో కూటమి సర్కారు అదికారం చేపట్టిన తర్వాత సీమలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉన్న విషయాన్ని గుర్తించి… వాటిలో అత్యంత అరుదైనదిగా భావిస్తున్న బంగారును వెలికితీసేందుకు రంగం సిద్ధం అయ్యింది. అందులో భాగంగా తొలుత కర్నూలు జిల్లా పరిధిలోని జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ఇటీవలే ప్రారంభం కాగా..రామగిరిలో గోల్డ్ మైనింగ్ కు రంగం సిద్దం అవుతోంది.

ప్రస్తుతం సత్యసాయి జిల్లా పరిధిలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోరి వచ్చిన రామగిరిలో బంగారం ఖనిజ నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా ఇటీవలే గుర్తించారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఖనిజం ఏ స్థాయిలో ఉంది? సదరు ఖనిజంలో బంగారం విలువ ఎంత? అన్న వివరాలపై అధ్యయనం చేయించింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ లో టన్నకు 1 గ్రామ్ బంగారం మాత్రమే వస్తుండగా… రామగిరి ఖనిజంలో టన్నుకు ఏకంగా 4 గ్రామలు బంగారం వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

ఈ విషయం తెలిసిన వెంటనే… ఏపీ ఖనిజ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే రామగిరి ప్రాంతంలో పర్యటించారు. స్థానిక (రాప్తాడు) ఎమ్మెల్యే పరిటాట సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ లతో కలిసి రామగిరి పరిధిలోని ఖనిజ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో రామగిరి పరిధిలో జరిగిన గోల్డ్ మైనింగ్ ప్రాంతంతో పాటుగా అక్కడి జరిగిన కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. జొన్నగిరి కంటే లాభదాయకమైన గోల్డ్ మైనింగ్ రామగిరిలో సాధ్యం కానున్న నేపథ్యంలో అతి త్వరలోనే రామగిరిలో గోల్డ్ మైనింగ్ ను ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

కర్నూలులో జొన్నగిరి, శ్రీసత్యసాయిలో రామగిరిలతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో బంగారం వంటి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లుగా మంత్రి రవీంద్ర తెలిపారు. అందులో భాగంగా జొన్నగిరి, రామగిరితో పాటు చిత్తూరు జిల్లాలోని చిగురుకుంట ప్రాంతంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నట్లుగా తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. రామగిరి తర్వాత చిగురుకుంటలోనూ గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. మొత్తంగా కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు నిజంగానే రతనాల సీమగా మారిపోనుందని చెప్పక తప్పదు.

This post was last modified on July 17, 2026 5:44 pm

Share

Recent Posts

కర్ణాటక హామీలను ట్రంప్ కాపీ కొడుతున్నారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక…

43 minutes ago

మోదీ పుట్టినరోజు.. దీపం వెలిగించండి!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా…

2 hours ago

రియల్ లైఫ్ ‘బిచ్చగాడు’ ఈ బీజేపీ ఎమ్మెల్యే

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. తన…

6 hours ago

సీఎం రేవంత్ విభేదాలు… సాయంత్రానికి సర్దుబాటు

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…

10 hours ago

ప్యారడైజ్ టికెట్ రేట్లకు ఏ స్ట్రాటజీ మంచిది

కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…

10 hours ago

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…

13 hours ago