Trends

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది. ఆ ఘటన మరిచిపోక ముందే మరో విమానం అచ్చం ఫ్లై దుబాయ్ విమానం తరహాలో ఆకాశంలో నుంచి ఒక్కసారిగా వేల మీటర్లు కిందకు దిగిపోవడంతో ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టింది. మళ్ళీ ఏమైనా దుశ్చర్య జరగబోతుందాని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

లండన్ నుంచి చికాగో బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ బీఏ 295 బోయింగ్ 777-200 ఈఆర్ విమానం ఉదయం 11.50 గంటల సమయంలో బయలుదేరింది. ఐర్లాండ్ మీదుగా 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా 28 వేల అడుగుల మేర కిందకు పడిపోయింది. కొద్ది నిమిషాల్లోనే దాదాపు 9 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. దీంతో పైలట్లు అంతర్జాతీయ అత్యవసర సంకేతాలు విడుదల చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యవసర పరిస్థితికి కారణం తెలియక భయాందోళనకు గురయ్యారు.

ఈ పరిస్థితి ఊహించని పైలట్లు సైతం ఆందోళనకు గురయినట్లు సమాచారం. వెంటనే అంతర్జాతీయ విమానయాన అత్యవసర సంకేతమైన 7700 కోడ్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పంపారు. ఈ వార్త నిముషాల్లోనే మీడియాకు చేరింది. వెంటనే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఛానెల్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రసారం అయ్యింది. ఇందులోని ప్రయాణికులు లండన్ హీ త్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరి అమెరికాలోని చికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఈ రెండు దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

కొద్ది సేపటి తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి లండన్ విమానాశ్రాయానికి చేర్చడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అంటే విమానం చికాగోకు వెళ్లకుండానే రిటర్న్ వచ్చేసింది. అయితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు విమానయాన అధికారులు తెలిపారు. ఈ సమస్యకు కారణం ఏమిటి, ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు వున్నారు అన్న విషయాలను అధికారులు ప్రకటించలేదు. వరస ప్రమాదాలతో అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా వెళ్లే విమాన ప్రయాణికులు భయపడి పోతున్నారు.

This post was last modified on October 6, 2026 8:24 am

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

17 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

25 minutes ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

5 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

9 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

సూప‌ర్ హిట్ సీక్వెల్… సైలెంటుగా రెడీ

టాలీవుడ్లో ఏ అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సర్పైజ్ హిట్ట‌యిన కొన్ని సినిమాలున్నాయి. అలాంటిదే.. 2018లో విడుద‌లై హుషారు సినిమా. అందులో…

10 hours ago